అప్పుల భారం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం సిరిగాయపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాంచిమి నర్సిములు(42)కు నాలుగెకరాల పొలం ఉంది. అందులో పత్తి, మొక్కజొన్న సాగు చేస్తుంటాడు. గత ఏడాది నీటి వసతి కోసం పొలంలో రెండు బోర్లు వేసినా నీళ్లు పడలేదు.
పంటలు సరిగా పండకపోవటంతోపాటు ఇద్దరు కూతుళ్లకు వివాహాలు చేయాల్సి రావటంతో రూ.6 లక్షల వరకు అప్పులున్నాయి. వాటిని తీర్చేదారికానరాక తీవ్ర వేదనతో ఉన్న నర్సిములు ఆదివారం రాత్రి పురుగు మందుతాగి, చనిపోయాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.