కొత్తూరు : అప్పుల భాదతో గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సిద్ధాపూర్ గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ కుటంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్‌నగర్‌లోని కమ్యూనిటీ ఆస్పత్రి వద్ద ఆదివార ం పరామర్శించారు. ప్రభుత్వం తరఫున మృతుడి కుటుంబాన్ని ఆదుకోనున్నట్లు వివరించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎమ్మె సత్తయ్య, అజయ్ ఉన్నారు.
రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి : సీపీఎం
అప్పుల బాధతో గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఎం షాద్‌నగర్ డివిజన్ కార్యదర్శి ఎన్.రాజు డిమాండ్ చేశారు. ఆయనతోపాటు కార్యవర్గ సభ్యుడు సాయిబాబాలు ఆదివారం సిద్ధాపూర్ వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.
అనంతరం వారు మృతరైతు సాగు చేసిన వరితోపాటు ఇతర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి వెన్నెముక లాంటి రైతు అప్పుల బాధతో మృతి చెందితే రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. వారి వెంట పలువురు నాయకులు ఉన్నారు.
రైతు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
Published Mon, Sep 14 2015 12:33 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement