2,400 మంది రైతుల ఆత్మహత్యలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
బోనకల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఎం మహాజన పాదయాత్ర బుధవారం మధిర నియోజకవర్గంలో కొనసాగింది. తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానని చెప్పిన కేసీఆర్, గుంటకాడ నక్కలా మారారని విమర్శించారు.
రాష్ట్రంలో 22 లక్షలమంది నిరుపేదలకు ఇళ్లు కావాల్సి ఉందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఇళ్లు కట్టించారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. యాదవులకు 3లక్షల యూనిట్లు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారని, ఒక్కొక్క యూనిట్‌కు 50 గొర్రెలు ఉండాలని అయితే అన్ని గొర్రె పిల్లలను ఎక్కడినుంచి తీసుకొస్తారని, వాటి మేతకోసం బీడు భూములు ఇస్తారా అని తమ్మినేని ప్రశ్నించారు.