
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: థర్డ్‌ఫ్రంట్‌లో చేరే ఆలోచన తమకు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. శుక్రవారం ఆ పార్టీ నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, సుధాకర్ రెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్ ప్రకటన దానిలో భాగమని పేర్కొన్నారు. అయితే.. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేక కూటమి ఏర్పాటు మంచి పరిణామమని పేర్కొన్నారు. కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్ తక్షణ రాజకీయ అవసరాల కోసమా అన్నది తేలాల్సి ఉందన్నారు.
నిజాయితీగా నిలబడతారా లేదా అనే విషయం స్పష్టంగా ప్రకటించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ వైదొలిగినా, ఈ నాలుగేళ్లపాటు చంద్రబాబు నోరెందుకు మెదపలేదని తమ్మినేని ప్రశ్నించారు. అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ బీజేపీని మోశారని విమర్శించారు. నికరమైన నిర్ణయం తీసుకునే ధైర్యం కేసీఆర్‌కు లేదని, జీఎస్టీ, నోట్ల రద్దు, కుంభకోణాలపై చంద్రబాబు, కేసీఆర్‌లు తప్పుబట్టలేక పోయారని తెలిపారు. రిజర్వేషన్ల వ్యవహారం న్యాయమైన డిమాండ్ అని చెప్పారు.