బస్సు జాతాను ప్రారంభిస్తున్న తమ్మినేని వీరభద్రం
సాక్షి, యాదాద్రి/ భువనగిరిటౌన్ : తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా సీపీఎం పార్టీ ఉద్యమిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల జయప్రదానికి శనివారం రాష్ట్ర బస్సు జాతాను భువనగిరిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబాటుకు గురైన బహుజనులకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు సీపీఎం పని చేస్తుందన్నారు.
జన్‌ధన్‌యోజన పేరుతో ప్రజలకు మోసగించిన మోదీ.. దేశాన్ని కాషాయికరణ చేసేందుకు బీజేపీ ప్రైవేట్ సైన్యాలను దేశంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలపైకి ఉసిగొల్పి దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసగించిన కేసీఆర్ తమ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేని పరిస్థితి ఉందన్నారు. అంతకుముందు స్థానిక బైపాస్‌రోడ్డు వద్ద తమ్మినేనిని స్థానిక పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి బాబు జగ్జీవర్‌రాం చౌరస్తా వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పొలినేని సుదర్శన్‌రావు, జాతా కన్వీనర్ జాన్‌వేస్లీ, సభ్యులు సాంబశివరావు, కొండమడుగు నర్సింహా, మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేషం, వేముల మహేందర్, బట్టుపల్లి అనురాధ, దాసరి పాండు, మాయ కృష్ణ, చింతల కిష్టయ్య, దయ్యాల నర్సింహ, సిర్పంగి స్వామి, వెంకటేశం, పెంటయ్యలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment