గ్రామ పంచాయతీలకు వివిధ పద్దుల కింద విడుదలయ్యే నిధుల వినియోగంపై ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరిస్తోంది. గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం నిధుల విడుదలకు సర్పంచుతోపాటు పంచాయతీ కార్యదర్శుల సంతకం తప్పనిసరిగా భావిస్తోంది. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ఉమ్మడి సంతకాలు ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.రేమంట్ పీటర్ జీఓ ఆర్‌టీ నంబర్ 278 ద్వారా శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
- సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం పంచాయతీలపై దృష్టి సారించింది. పంచాయతీలకు విడుదల చేసే నిధులను క్షేత్రస్థాయిలో సద్వినియోగమయ్యేలా చూడాలని ఉన్నతాధికారులకు సూచించింది. గతంలోనూ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల ఉమ్మడి సంతకాల నిబంధన ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది. తాజాగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం జాయింట్ చెక్‌పవర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి ఇటు సర్పంచులు, అటు కార్యదర్శులలో కలకలం రేపాయి. జాయింట్ చెక్‌పవర్ ఇవ్వడమంటే రాజ్యా ంగబద్ధంగా సంక్రమించిన హక్కును కాలరాయడమేనని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఇద్దరికీ బాధ్యత ఉంటే తప్పులు జరగడానికి అస్కారం ఉండదని కార్యదర్శులు అంటున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 718 మంది పంచాయతీ కార్యదర్శులు అవసరం కాగా, ప్రస్తుతం 210 మందే ఉన్నారు. ఒక్కొక్కరు నాలుగైదు గ్రామా లకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ చెక్‌పవర్ కారణంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. సీపీడ బ్ల్యూఎస్, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు, వీధిదీపాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, నిర్వహణ పనులతోపాటు 13వ ఆర్థిక సంఘం, బీఆర్‌జీఎఫ్, ఆర్‌జీపీఎస్ ఏ తదితర పథకాల నిధుల వినియోగంలో ఇద్దరి సంతకం తప్పనిసరని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇది ఇబ్బందిగా మారుతుందేమోనని భావిస్తున్నారు.
నిధుల దుర్వినియోగం నేపథ్యంలోనే
గ్రామ పంచాయతీలకు గతంలో అనేక పద్దుల కింద నిధులు విడుదల కాగా, పారదర్శకత లేక చాలా వర కు దుర్వినియోగం అయినట్లు ఫిర్యాదులున్నాయి. వెనుకబ డిన ప్రాంతాల అభివృద్ది నిధుల(బీఆర్‌జీఎఫ్)ను ఇష్టారాజ్యంగా వాడుకున్నట్లు విచారణ లో కూడా తేలింది. గత ఐదేళ్లలో జడ్‌పీ, ఎంపీ, జీపీ సెక్టార్‌ల కింద రూ.106. 50 కోట్లు విడుదల కాగా, గ్రామ పంచాయతీలకు సుమారుగా రూ. 53 కోట్ల వరకు కేటాయించారు. జిల్లాకు ఏడాదికి రూ.21.54 కోట్ల వరకు బీఆర్‌జీ నిధులు విడుదల కాగా జడ్‌పీకి 20 శాతం, మండలాలకు 30 శాతం, గ్రామ పంచాయతీలకు 50 శాతం కేటాయిస్తూ వచ్చారు.
అభివృద్ధి పేరిట బీఆర్‌జీ నిధులను ముందుగానే డ్రా చేసిన ప్రజాప్రతినిధులు నిధుల వినియోగానికి సంబంధించిన మెజర్‌మెంట్ బుక్‌లు, యుటిలైజేషన్ సర్టిఫికెట్‌లు సమర్పించడంలో విపరీత జాప్యాన్ని ప్రదర్శించారు. ఇలా 2012 డిసెంబర్ నాటికి మొత్తంగా జిల్లాలో రూ.3,23,16,550లు బకాయిలు ఉండిపోయాయి. 2013 మే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, అనేక రకాల ప్ర యత్నాలతో రూ.1.97 కోట్లు రికవరీ చేశారు. జూన్ లో జరిగిన ఎన్నికలలో కొత్తవారు ఎన్నికయ్యారు. రూ 1,25,54,516 మాత్రం 165 మంది మాజీ సర్పంచుల వద్దే ఉండిపోయాయి. గతంలో నిధుల దుర్వినియోగం అయిన సందర్భాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జాయింట్ చెక్‌పవర్ ఉత్తర్వులిచ్చినట్టు సమాచారం.
ముగుతాడు
Published Sun, Dec 7 2014 2:50 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement