అడుగంటుతున్న జలాశయాలు
మేల్కొనకపోతే తిప్పలే
{పజా ప్రతినిధులపైనే బాధ్యత
వరంగల్ : వరంగల్ నగర ప్రజలకు తాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ముందుచూపు లేని ప్రజాప్రతినిధులు, దీర్ఘకాలిక ప్రణాళికలు లేని అధికార యంత్రాంగం వైఖరితో గ్రేటర్ వరంగల్ ప్రజలు వేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. ఫిబ్రవరిలోనే మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇదే స్థాయిలో ఎండలు పెరిగితే మే, జూన్ నెలల్లో నీటి సరఫరా ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనచెందుతున్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌కు నీటి సరఫరా చేసే జలాశయాలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు జూలై వరకు వర్షాలు కురిసే పరిస్థితి లేదని వాతావరణ అంచనా నివేదికలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చే వరకు గ్రేటర్ వరంగల్ ప్రజల నీటి అవసరాలు తీర్చే విషయంలో ప్రజాప్రతినిధులు ఆశించిన మేరకు చొరవ తీసుకోవడం లేదు. మహా నగరర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియడం లేదు.
గ్రేటర్ వరంగల్ జనాభా తొమ్మిది లక్షలు కాగా, ప్రతిరోజూ నగరానికి వచ్చిపోయే వారితో కలిపితే సగటున పది లక్షల జనాభా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు 160 లీటర్ల నీరు అవసరం. హైదరాబాద్ మహానగరంలో ఇదే తరహాలో నీటి సరఫరా చేస్తున్నారు. వరంగల్ నగరంలో మూడు రోజులకోసారి 90 లీటర్లే సరఫరా చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 75,446 నల్లా కనెక్షన్లు, 2067 చేతిపంపులు, 34 వాటర్ ట్యాంకర్లు ఉన్నా యి. నగర ప్రజలకు 365 రోజులు తాగునీరు ఇవ్వాలంటే నాలుగు టీఎంసీల నీరు అవసరం. వేసవిలో వరంగల్ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ధర్మసాగర్, వడ్డేపల్లి, భధ్రకాళి జలాశయాల నుంచి ఒకటిన్నర టీఎంసీల నీరే లభ్యమవుతోంది. మరో రెండున్నర టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఉండాల్సిన అవసరం ఉంది. వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు దేవాదుల, లోయర్ మానేరు ప్రాజెక్టు(ఎల్‌ఎండీ)లే ప్రధాన వనరులుగా ఉన్నాయి. వర్షాభావంతో దేవాదులలో నీటిని పంపింగ్ చేసే పరిస్థితి లేకపోగా, కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండీలోనూ నీటి నిల్వ లేదు. ప్రత్యామ్నాయంగా చలివాగు, భీం ఘన్‌పూర్ జలాశయాల నుంచి నీటిని వరంగల్‌కు తరలించాలని జీడబ్ల్యూఎంసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇదే చేస్తే రెండు జలాశయాల కింద ఆయకట్టు రైతులు ఆందోళనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులను గట్టిక్కించే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర్మసాగర్, వడ్డేపల్లి, భద్రకాళి జలాశయాల్లో 430 మిలియన్ క్యూబిక్ ఫీట్(ఎంసీఎఫ్‌టీ)ల నీటి నిల్వలున్నాయి. తాగునీటి సరఫరా ప్రక్రియలో భాగంగా మూడు ఫిల్టర్ బెడ్లతో ప్రస్తుతం 3.5 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటి శుద్ధి జరుగుతోంది. 123 రోజుల వరకు అంటే జూన్ 13వరకు నీటి సరఫరా చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. వేసవి తీవ్రత పెరిగి తే ఆలోపే నీళ్లు పూర్తిగా అయిపోతాయి. అధికారులు చెప్పిన గడువు వరకు వ ర్షాలు రాకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఈ కష్టాలను అధిగంచేం దుకు భీంఘన్‌పూర్, చలివాగు జలాశయాలను వినియోగించుకోవాలని అధికారు లు సూచిస్తున్నారు. ఈ ప్రతిపాదన అమలు చేయడం సవాల్‌గా మారనుంది.
అదృశ్యమైన బాలిక తల్లికి అప్పగింత
గూడూరు : ఈనెల 4న అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని బోడ సరితను గురువారం తహశీల్దార్ లక్ష్మి ముందు హాజరుపరిచి, తల్లి జమ్కు అప్పగించినట్లు ఎస్సై వై. సతీష్ తెలిపారు. మండలంలోని చిన్నఎల్లాపురం శివారు కోబల్‌తండాకు చెందిన సరిత ఇంటి నుంచి వెళ్లిన విషయం తెలిసిందే. సంగెం మండలం తీగరాజ్‌పల్లికి చెందిన బాలిక పెద్దమ్మ అమ్కు గురువారం సరితతో పీఎస్‌కు వచ్చింది. తన ఇం టికి వచ్చిన సరిత ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నందున ఇక్కడే ఉంటానని చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆమెను తల్లికి అప్పగించారు.
గ్రేటర్‌కు నీళ్ల గండం
Published Fri, Feb 12 2016 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM
Advertisement
Advertisement