రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలం
మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి
కరీంనగర్: రైతుల రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి విమర్శించారు. ముకుందలాల్ మిశ్రాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడారు. రుణమాఫీ విషయంపై బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేయూలని కోరారు. చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీపై యంత్రాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సరఫరా చేయూలని కోరారు. సా దాబైనామా గడువును ఈనెలాఖరు వరకు పొడిగించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వర్ణ వెంకట రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజన్న, శ్రవణ్‌కుమార్, జనార్దన్‌రెడ్డి, అమరేందర్, రవీందర్ పాల్గొన్నారు.
నేడు, రేపు సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు
సీపీఎం కరీంనగర్ డివిజన్‌స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈనెల 11, 12 తేదీల్లో కోతిరాంపూర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్లు డివిజన్ కార్యదర్శి గుడికందుల సత్యం తెలిపారు. ఈ సమావేశాలకు డివిజన్ పార్టీ సభ్యులు, శాఖ కార్యదర్శులు హాజరుకావాలని వారు కోరారు.