పారిశ్రమిక గుమ్మంగా పాలమూరు
మహబూబ్‌నగర్: వలసల జిల్లా పాలమూరు ఇక.. పారిశ్రామిక గుమ్మంగా మారనుంది. జిల్లాలో నిక్షిప్తమై ఉన్న అపార సహజవనరులను వినియోగించుకోవడం ద్వారా పాలమూరును పారిశ్రామిక కేంద్రంగా తీర్చదిద్దాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి జిల్లా అధికారుల సంకల్పం తోడు కావడంతో జిల్లా ఇక పారిశ్రమిక ఖిల్లాగా వెలుగొందే అవకాశాలు ప్రస్పుటమవుతున్నాయి. ఇందుకు పారిశ్రామికవేత్తలనుండి సైతం అనూహ్య స్పందన లభించింది. ఫలితంగా కొత్తూరులోని ఒక రిసార్ట్స్‌లో జిల్లా కలెక్టర్ శ్రీదేవి అద్యక్షతన శుక్రవారం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సుకు రాష్ట్రానికిచెందిన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్త లు హాజరయ్యారు.
జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. రూ. 695 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే వివిధ పరిశ్రమల్లో జిల్లాలోని నిరుద్యోగులకు ఉపా ధి కల్పించడానికి సత్వరం కార్యాచరణలోకి దిగుతున్నట్టు పారిశ్రామిక సంస్థలు ప్రకటిం చాయి. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి నూతన పరిశ్రమలు నెలకొల్పాలన్న లక్ష్యం తో తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామి క విధానాన్ని ఇటీవల ప్రవే శపెట్టింది. ప్రభుత్వం సరళీకరించిన నూతన పారిశ్రామిక విధానాన్ని జిల్లాకు వరంగా మల్చుకోవాలని సంకల్పించిన జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి రాష్ర్టంలోనే తొలిసారిగా అడ్వాంటేజ్ (సానుకూల)మహబూబునగర్ పేరిట పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. పరిశ్రమలకు మహబూబ్‌నగర్ ఏ విధంగా అనుకూలమైందో.. ఇక్కడ లభించే సహజవనరులు పరిశ్రమల స్థాపనకు ఏవిధంగా దోహదపడతాయి.. రవాణా పరిస్థితులు ఎలా అనువుగా ఉంటాయన్న అంశాలతో పాటు జిల్లా భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై గంట పాటు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
జిల్లా చేనేత రంగానికి పెట్టింది పేరని గద్వాల, నారాయణపేట చీరలు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వని.. తిరుపతిలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో సైతం గద్వాల చీరను వినియోగిస్తారని వివరించారు. కోస్గిలో టస్సర్ పట్టును తయారు చేస్తారని.. జిల్లాలో ఊలు కుటీర పరిశ్రమగా విరాజిల్లుతుందని వివరించారు. వేరుశనగ, జొన్న, ఆముదం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నామన్నారు. ఫార్మా పరిశ్రమతో పాటు వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి కావాల్సిన సౌకర్యాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరిశ్రమలకు పరిపాలన అనుమతులు ఇచ్చేందుకు మానటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దళిత్ ఇండియా పారిశ్రీమిక వేత్తల సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో జిల్లా కలెక్టర్లు ఈ స్థాయిలో పారిశ్రమిక అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు.
గత సంవత్సరమైతే ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కమిటీ సమావేశాలు కేవలం రెండు మాత్రమే జరిగాయన్నారు. సమావేశంలో పలువురు మహిళా పారిశ్రమికవేత్తలు, జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్, జేసీ రాంకిషన్, షాద్‌నగర్ ఏఎస్పీ సందీప్ కుమార్, జిల్లాపరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్ రెడ్డి, పంచాయితీ అధికారి వెంకటేశ్వర్లు, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.