
డబ్బు కోసమే కిడ్నాప్
వరంగల్ క్రైం :
సంచలనం సృష్టించిన పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డి కిడ్నాప్ వ్యవహారాన్ని వరంగల్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కేసులో నిందితులైన నలుగురిలో ఇద్దరిని కేయూసీ పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హన్మకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు నిందితుల వివరాలు వెల్లడించారు.
నిందితుల్లో హన్మకొండ వికాస్‌నగర్‌కు చెందిన ఉతకం దీపక్, గోకుల్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ కడారి రాజు, కాజీపేట ఫాతిమానగర్‌కు చెందిన నాగెళ్లి సంతోష్, వర్ధన్నపేటకు చెందిన హరీణ్ ఉన్నారు.
ఉతకం దీపక్ మద్యం వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతడు టాటా సుమో వాహనం చోరీ కేసులో నిందితుడు.
రెండో నిందితుడైన రౌడీషీటర్ కడారి రాజు అంబేద్కర్‌భవన్ వద్ద ఉన్న తిరుమల బార్ వద్ద జరిగిన హత్య కేసులో నిందితుడు. కోర్టు వారుుదాలకు హాజరయ్యే క్రమంలో దీపక్‌కు తన బావమరిది ద్వారా రాజు పరిచయమయ్యూడు. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణరుుంచుకున్నారు. ఇద్దరూ కలిసి కోర్టుకు సమీపంలో ఆస్పత్రి నిర్వహిస్తున్న డాక్టర్ సురేందర్‌రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు పథకం రచించారు. గతంలో దీపక్ తన చెల్లెలి కుమార్తె చికిత్స కోసం తరచూ డాక్టర్ సురేందర్‌రెడ్డి దగ్గరికి వెళ్లేవాడు.
ఈ క్రమంలోనే అతడు సదరు వైద్యుడు హుజూరాబాద్ పట్టణంలోనూ క్లినిక్ నడుపుతున్నట్లు, ఇందుకోసం ప్రతీరోజు హన్మకొండ నుంచి హుజూరాబాద్‌కు వెళ్లి వస్తారని తెలుసుకున్నాడు. అతడు హరీణ్, సంతోష్‌కు డబ్బు ఆశజూపి డాక్టర్‌ను కిడ్నాప్ చేయడంలో సహకరించాలని కోరాడు. నలుగురు కలిసి ఆగస్టులో డాక్టర్‌కు ఫోన్ చేసి హుజూరాబాద్ ప్రాంతంలో క్లినిక్ నడుపొద్దని, తమ మా ట వినకుంటే హత్య చేస్తామని, ఇందుకోసం రూ.50 లక్షలు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామంటూ బెదిరించారు. ఆగస్టు 18, 19 తేదీల్లో డాక్టర్‌ను కిడ్నాప్ చేసేందుకు యత్నిం చగా కారు సమస్యతో ఆ ప్రయత్నం విఫలమైంది.
కిడ్నాప్ చేసిందిలా..
ఆగస్టు 21న డాక్టర్ సురేందర్ రెడ్డి హుజూరాబాద్‌లోని తన క్లినిక్ నుంచి రాత్రి 9 గంటలకు హన్మకొండకు కారులో బయల్దేరాడు. అదే సమయంలో నిందితులు నలుగురు కలిసి ఇన్నోవా వాహనంలో డాక్టర్ కారును వెంబ డించారు. రాత్రి 10 గంటలకు డాక్టర్ తన కాంపౌండర్‌ను హన్మకొండ బస్టాండ్ ప్రాం తంలో దింపి తన ఇంటికి వెళుతుండగా ఇం టికి సమీపంలోనే ఆయన కారుకు వారి ఇన్నో వా కారును అడ్డుపెట్టారు. కత్తితో బెదిరించి కిడ్నాప్ చేశారు.
దేవన్నపేట గ్రామశివారులోకి తీసుకెళ్లి ‘నిన్ను చంపేందుకు ఒకరితో ఒప్పం దం చేసుకున్నామని, చంపకుండా ఉండాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. ఆయన సెల్ నుంచి ఆయన భార్య డాక్టర్ ఉషారాణికి ఫోన్ చేసి బెదిరించారు. కొద్దిరోజుల క్రితం ప్లాట్ అమ్మగా వచ్చిన రూ. 21 లక్షలు ఉన్నాయని చెప్పడంతో నిందితుల్లో ఒకరైన ఇన్నోవా కారు డ్రైవర్ డాక్టర్ ఇంటికి వెళ్లి ఆ డబ్బులను తీసుకొచ్చాడు. డబ్బు చేజిక్కించుకున్న కిడ్నాపర్లు డాక్టర్‌ను కేయూసీ వంద ఫీట్ల రోడ్డులోని శ్యామల గార్డెన్స్ వద్ద వదిలి వెళ్లారు.
రూ.21 లక్షల్లో దీపక్ రూ.14.80 లక్షలు, రాజు 4.40 లక్షలు, సంతోష్ రూ.60 వేలు, హరీన్ రూ. 1.20 లక్షల చొప్పున పంచుకున్నారు. కాగా డాక్టర్ ఫిర్యాదుతో కేసు తొలుత హుజూరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. హన్మకొండలో కిడ్నాప్ జరిగినట్లు తెలుసుకుని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు కేసు విచారణ బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీ సర్కిల్ సీఐ దేవేందర్‌రెడ్డికి అప్పగించారు. నిందితులు దీపక్, సంతోష్ వడ్డేపల్లి సమీపంలోని ఫిల్టర్‌బెడ్ పరిసరాల్లో ఉన్నట్లు హన్మకొండ డీఎస్పీ దక్షిణమూర్తికి మంగళవారం తెలియడంతో ఆయన సీఐ దేవేందర్‌రెడ్డికి సమాచారమిచ్చారు.
సీఐ సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాము డాక్టర్‌ను కిడ్నాప్ చేసినట్లు అంగీకరించారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి రూ.7.34 లక్షల నగదు, కిడ్నాప్‌నకు ఉపయోగించిన ఇ న్నోవా కారు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయడం, నగదు స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ దక్షిణామూర్తి, సీఐ దే వేందర్‌రెడ్డి, స్పెషల్‌బ్రాంచ్ ఎస్సైలు కృష్ణకుమార్, ప్రభాకర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, కిరణ్‌కుమార్, రాకేశ్, వెంకట్, రాజ్‌కుమార్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.