మీ పిల్లలైతే ఇలాంటి అన్నమే పెడతారా? | The principal functions of angry parents | Sakshi
Sakshi News home page

మీ పిల్లలైతే ఇలాంటి అన్నమే పెడతారా?

Published Tue, Apr 14 2015 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

మీ పిల్లలైతే ఇలాంటి అన్నమే పెడతారా?

మీ పిల్లలైతే ఇలాంటి అన్నమే పెడతారా?

- ప్రిన్సిపాల్ పనితీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
- పనితీరు మార్చుకోవాలని ప్రిన్సిపాల్‌కు వసంతరావు హెచ్చరిక

మెదక్ టౌన్ : మీ పిల్లలైతే ఇలాంటి అన్నం, కూరలే వండి పెడతారా? ఇలాంటి అన్నం పెడితే పిల్లలు ఎలా తింటారు? అంటూ స్థానిక గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ రమణ తీరుపై మంగళవారం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన డిప్యూటీ సెక్రటరీ వసంతరావు ప్రిన్సిపల్‌పై మండిపడి పనితీరు మార్చుకోవాలని, లేకుంటే శాఖపర చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. తెలంగాణ గురుకుల పాఠశాలల డిప్యూటీ సెక్రటరీ వసంతరావు మెదక్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పర్యటించి భోజన వసతి గృహాన్ని పరిశీలించారు.

అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, స్నానాలు సైతం సరిగా చేయలేక పోతున్నామని విద్యార్థులు ఆయనతో మొర పెట్టుకున్నారు. పాఠశాలలో ఫ్యాన్‌లు పనిచేయడం లేదని విద్యార్థులు డిప్యూటీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఫ్యాన్లను మరమ్మతులు చేయించాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులంలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, తాము ప్రశ్నిస్తే కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు కాకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ ప్రిన్సిపల్ నిర్లక్ష ్యపు సమాధానం చెబుతున్నారని, వాటర్ ట్యాంకుల్లో పూర్తిగా నాచు పేరుకు పోయింది, భోజన గది పరిసరాలన్ని పూర్తిగా దుర్గంధ భరింతంగా ఉన్నాయని, విద్యార్థులతో టిఫెన్ క్యారియర్లు మోయిస్తున్నారని సెక్రటరీ దృష్టికి తెచ్చారు.

ఆరోపణల్లో నిజం ఉంది : వసంతరావు
పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, విద్యార్థులకు సరిగా భోజనం పెట్టడం లేదని, గుడ్లు ఇవ్వడం లేదన్న ఆరోపణలు రావడంతో తనిఖీకి వచ్చినట్లు డిప్యూటీ సెక్రటరీ వసంతరావు విలేకరులతో తెలిపారు. ఇక్కడి పరిస్థితి చూశాక అదే నిజమేనని తేలిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 49 పాఠశాలల్లో 23,520 మంది విద్యార్థులు చదువుతున్నారని, అన్ని పాఠశాలల్లో మెదక్ పాఠశాలనే చాలా పెద్దదని తెలిపారు. ఇందులో మంచి ఫలితాలు వస్తాయన్నారు.

పాఠశాలలో నీటి సమస్య, కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇకనుండైన పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ రమణమ్మను హెచ్చరించారు. అనంతరం పేరెంట్స్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఎలాంటి సమస్యలున్నా తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement