మెదక్(కోడూరు): మెదక్ జిల్లా కోడూరు మండల పరిధిలోని చంద్లాపూర్‌లో సోమవారం బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లతో గ్రామంలోని దేవాలయాల చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండాలని రైతులకు పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామస్తులందరూ వాహనాలను గ్రామంలోని దేవాలయాల చుట్టూ తిప్పడంప్రతియేటా అనవాయితీగా వస్తున్నది. ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉన్న రంగనాయకుల స్వామి గుట్ట చుట్టూ బండ్లతో ఊరేగించి తమ మొక్కులను తీర్చుకుంటారు.
గుట్ట కింద ఉన్న హనుమాన్ దేవాలయం, నవగ్రహ దేవాలయం, పెద్దమ్మ దేవాలయం, బీరప్ప దేవాలయం, ఎల్లమ్మ దేవాలయంతో పాటు తదితర దేవాలయాల చుట్టూ బండ్లను ఊరేగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో బండ్ల ఊరేగింపుతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం గ్రామంలో రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కోడూరులో బండ్ల ఊరేగింపు
Published Mon, May 4 2015 9:30 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement