kodur
-
ఇదే మనం జగనన్నకు ఇచ్చే గిఫ్ట్: ఆలీ
-
ల్యాప్‌టాప్ పేలి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు తీవ్ర గాయాలు
సాక్షి, వైఎస్సార్‌జిల్లా: బి.కోడూరు మండలంలోని మేకవారి పల్లెలో ల్యాప్‌టాప్ పేలి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సుమలత (22) అనే టెక్కీ సోమవారం ఉదయం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బెడ్‌పైన కూర్చొని వర్క్ చేస్తున్న సుమలత విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బెడ్‌కు సైతం మంటలు అంటుకున్నాయి. గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అప్పడికే తీవ్రంగా గాయపడిన సుమలతను చికిత్స నిమిత్తం కడప సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 80 శాతం కాలిన గాయాలవ్వడంతో యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా సుమలత బెంగుళూరుకు చెందిన మ్యాజిక్ టెక్ సొల్యూషన్‌లో పనిచేస్తోంది. చదవండి: ‘మీకు పెన్ ఉంటే, మాకు గన్ ఉంది’.. జర్నలిస్టుపై పోలీస్ దురుసు ప్రవర్తన -
పులకించిన సాగరతీరం
ముగిసిన వేళాంగణి మహోత్సవాలు తోటపల్లిగూడూరు: కోడూరు వేళాంగణిమాత(మరియమాత) జన్మదిన ఆరాధనోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. యేసుక్రీస్తు తల్లి వేళాంగణిమాత జన్మదినోత్సవాలు ఈ నెల 6 నుంచి జరుగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఉత్సవాల్లో చివరి రోజు గురువారం రాత్రి అమ్మవారికి సమిష్ట దివ్యబలిపూజ, తేరు ప్రదక్షిణ కార్యక్రమాలు అత్యంత వేడుకగా జరిగాయి. భక్తులు అమ్మవారి పుణ్యక్షేత్ర ఆవరణలో రాత్రి జాగారాలు చేశారు. అనంతరం ఉత్సవాల్లో చివరి ఘట్టమైన సముద్ర స్నానాలకు భక్తులు ఆసక్తి చూపారు. ఆలయంలో రాత్రి జాగరణ చేసిన వేలాది మంది భక్తులు శుక్రవారం వేకువజాము నుంచి స్థానికంగా ఉన్న కోడూరు బీచ్‌లో పుణ్యస్నానాలకు బయల్దేరారు. భక్తుల పుణ్యస్నానాలతో కోడూరు సాగర తీరం పులకించిపోయింది. వేళాంగణి చర్చి ప్రాంతం భక్తులతో కిక్కిరిసింది. -
వేళాంగణిమాత ఉత్సవాలు ప్రారంభం
కోడూరు తీరంలో కోలాహలం తోటపల్లిగూడూరు: కోడూరు వేళాంగణిమాత(మరియమాత) ఉత్సవాలు మంగళవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. కులమతాలకతీతంగా పూజలందుకొంటున్న వేళాంగణి మాత జన్మదినం సెప్టెంబర్ 8న పురష్కరించుకొని మూడు రోజుల పాటు వేళాంగణిమాత ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో మంగళవారం వేళాంగణి చర్చి డైరెక్టర్ ఫాదర్ తామస్ అగస్టీన్ ఆధ్వర్యంలో ప్రారంభ ప్రార్థనలు నిర్వహించారు. ‘దేవమాత వేళాంగణి అద్భుతాల మాత’ అనే అంశంపై భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు ఈ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం భక్తులు కోడూరు బీచ్‌లో సముద్ర స్నానాలను ఆచరించారు. సాయంత్రం సర్వాంగసుందరంగా కొలువుదీరిన వేళాంగణిమాత తేరు ప్రదక్షణ చర్చి నుంచి ముత్యాలతోపు పట్టపుపాళెం వరకు సాగింది. ఉత్సవాల్లో నేడు వేళాంగణిమాత ఉత్సవాల్లో బుధవారం ఉదయం 7గంటలకు జపమాల–నవదిన ప్రార్ధనలు, 9 గంటలకు ఆరాధన–స్వస్థత ప్రార్ధనలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు సింహపురి పీఠాధిపతులు డాక్టర్ ప్రకాశం వేళాంగణిమాతకు దివ్యబలిపూజను సమర్పిస్తారు. అలాగే రాత్రి 8 గంటలకు అమ్మవారి చర్చి నుంచి కొత్తకోడూరు వరకు విగ్రహ తేరుప్రదక్షణ సాగుతుంది. -
కోడూరులో బండ్ల ఊరేగింపు
మెదక్(కోడూరు): మెదక్ జిల్లా కోడూరు మండల పరిధిలోని చంద్లాపూర్‌లో సోమవారం బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లతో గ్రామంలోని దేవాలయాల చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండాలని రైతులకు పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామస్తులందరూ వాహనాలను గ్రామంలోని దేవాలయాల చుట్టూ తిప్పడంప్రతియేటా అనవాయితీగా వస్తున్నది. ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉన్న రంగనాయకుల స్వామి గుట్ట చుట్టూ బండ్లతో ఊరేగించి తమ మొక్కులను తీర్చుకుంటారు. గుట్ట కింద ఉన్న హనుమాన్ దేవాలయం, నవగ్రహ దేవాలయం, పెద్దమ్మ దేవాలయం, బీరప్ప దేవాలయం, ఎల్లమ్మ దేవాలయంతో పాటు తదితర దేవాలయాల చుట్టూ బండ్లను ఊరేగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో బండ్ల ఊరేగింపుతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం గ్రామంలో రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.