
రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వం
► రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది
► టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
జగిత్యాల అర్బన్ : రాష్ట్రప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు అన్నారు. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. టీడీపీ హయూంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. మహిళలు, ఎస్సీలు, బీసీలకు టీడీపీ హయూంలోనే పదవులు దక్కాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకొచ్చినప్పటినుంచీ వర్షాలు కురవడం లేదని, ప్రాజెక్టులు ఎండిపోతున్నాయని, అందుకే ఇది ఐరెన్‌లెగ్ ప్రభుత్వమని మండిపడ్డారు.
మహారాష్ట్రతో ప్రాజెక్ట్‌ల కోసం ఒప్పందం చేసుకున్న విషయూలు మీడియూకు తెలపకుండా.. గొప్ప సాధించామన్నట్లు ఊరేగింపులు చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రం కరువుతో విలవిల్లాడుతుంటే పట్టించుకునేవారు కరువయ్యూరని, కనీసం పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాలె శంకర్, వొల్లం మల్లేశం, మల్లారెడ్డి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.