ప్రతి ఒక్కరికీ సంక్షేమం | The welfare of everyone | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరికీ సంక్షేమం

Published Fri, Mar 4 2016 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

ప్రతి ఒక్కరికీ  సంక్షేమం

ప్రతి ఒక్కరికీ సంక్షేమం

టీఆర్‌ఎస్ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం
రెబల్స్‌పై బహిష్కరణ వేటు తప్పదు
ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి హరీశ్‌రావు

 
న్యూశాయంపేట/హన్మకొండ చౌరస్తా/ మామునూరు/ వరంగల్/మడికొండ/హసన్‌పర్తి : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నగరంలోని పలు డివిజన్లలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తామన్నారు. వరంగల్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ, అసరా పింఛన్లు, పోలీసు కమిషనరేట్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం, టెక్స్‌టైల్స్ పార్క్, ఐటీ హబ్ పథకాలతో అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని వివరించారు. 

హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ ప్రభుత్వం పట్ల ప్రజాదరణను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. విలీన గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు విడుదల చేస్తామన్నారు. వరంగల్‌ను రెండవ రాజధానిగా చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పారు. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిసీ తెలియక ఏదో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ ఉచితంగా ఎలా ఇస్తారని,  హైదరాబాద్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు. నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఎవరైనా అధికారులు ఏ పనికోసమైనా లంచం అడిగితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. నగరంలో ఆదర్శవంతమైన పాలన అందేలా చూస్తామన్నారు. ఈ ఏడాది నుంచి మహిళా సంఘాలకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణం అందిస్తామని చెప్పారు. అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
టీఆర్‌ఎస్ భారీ ర్యాలీ

 హ న్మకొండ : 47వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని నల్ల స్వరూపరాణిని గెలిపించాలని కోరు తూ గురువారం తెలంగాణ కళారూపాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీలకు అభ్యర్థులు కరువయ్యూరని ఎద్దేవా చేశారు.  ఆ యూ కార్యక్రమాల్లో మంత్రి చందూలాల్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యే లు గంగుల కమలాకర్, బాబూమోహన్, దా స్యం వినయ్‌బాస్కర్, అరూరి రమేష్, ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి, అభ్యర్థులు కేసిరెడ్డి మాధవి, చింతల యాదగిరి, తూర్పా టి సులోచన, నాయకులు రాజారపు ప్రతాప్, గైగేని రాజన్న, కె.వాసుదేవరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నక్క బాస్కర్, బత్తిని శ్రీనివాస్, బంక రాకేష్, జక్కుల రవి, పోశాల సదానందం, ముప్ప నర్సయ్య, ముప్ప సతీష్, బు స్స వెంకటేశ్వర్లు, కొత్తకొండ సుభాష్,  జక్కుల రమేష్, కందుకూరి చంద్రమోహన్, రమేష్‌నాయక్, దరిగె నిరంజన్, బైరపాక ప్రశాంత్, పుల్లా ప్రభాకర్, మనోహర్, రఘు, కిషన్, అశోక్, సుమన్, ఊకంటి వనంరెడ్డి, మద్దెల నారాయణస్వామి, కిర్తి వెంకటేశ్వర్లు, రాజేశ్వర్‌రెడ్డి, శివ, రవి, బోగి దేవేందర్, రవీందర్, వీరస్వామి, సారయ్య పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement