- రైలు నుంచి దూకి యువతి, యువకుడి బలవన్మరణం
- మృతులు ఏలూరు వాసులు
- యశ్వంతాపూర్-రఘునాథపల్లి మధ్య ఘటన
కాజీపేటరూరల్/జనగామ టౌన్, న్యూస్‌లైన్ : వేగంగా వెళుతున్న రైలు నుంచి ఓ యువతి దూ కగా.. ఆ వెంటనే ఆమెను పిలుస్తూ మరో యువకుడు కిందికి దూకాడు. యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, యువతి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన యశ్వంతాపూర్ - రఘునాథపల్లి స్టేషన్ల మధ్య శనివారం జరిగింది.
జీఆర్‌పీ ఎస్సై శ్రీనివాస్, రైల్వే అధికారుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుడిపుడి సాగర్(23), కోడి మౌనిక(22) సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టిక్కెట్ తీసుకుని హౌరా ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్-9 బోగీలో ప్రయాణిస్తున్నారు. రైలు యశ్వంతాపూర్-రఘునాథప ల్లి మధ్యకు రాగానే వేగంగా మౌనిక దూకగా, ఆమెను పిలుచుకుంటూ సాగర్ దూకాడు.
అత డు అక్కడికక్కడే మృతిచెందగా, మౌనిక గాయ పడింది. సమాచారం అందుకున్న కాజీపేట జీ ఆర్‌పీ ఎస్సై శ్రీనివాస్, ఏరియా ఆఫీసర్ కుమార్, చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ టి.ధర్మరాజు, స్టేషన్ మేనేజర్ ఎం.ఓదెలు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మౌనికను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి రైలు టిక్కెట్లతోపాటు ఇద్దరి ఓటరు గుర్తింపు కార్డులు మృతుడి వద్ద లభించగా, ఇద్దరు ఏలూరుకు చెందిన వా రిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచార మిచ్చారు.
అలాగే, యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొం దుతూ మౌనిక గంట తర్వాత మృతిచెందింది. కాగా మృతురాలు హ్యాండ్‌బాల్ జాతీయ క్రీడాకారిణి అని, ఆమెకు నేషనల్ పోలీస్ అకాడమీ లో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని ఆమె మేనమామ చెప్పినట్లు ఎస్సై తెలిపారు. సాగర్ ఇటీవల డిగ్రీ పరీక్షలు రాసినట్లు అతడి వద్ద హాల్‌టిక్కెట్ ఉందని ఎస్సై వెల్లడించారు.