మంచిర్యాలలో మైనర్ దొంగ అరెస్టు
Published Wed, Jan 20 2016 10:44 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఓ మైనర్ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు రూ. 10 వేల నగదు, రెండు ల్యాప్ టాప్ లును కూడా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement