మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలో శనివారం అర్థరాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. మిర్యాలగూడ అగ్రిగోల్డ్ కాలనీకు చెందిన పున్నా సత్యం అనే వ్యక్తి ఇంట్లో చోరికి పాల్పడ్డారు.
మూడు రోజుల క్రితం సత్యం వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి 16 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.60 వేల నగదు, ఓ ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి తాళాలు పగలు గొట్టి ఉండటం గమనించిన స్థానికులు హైదరాబాద్లో ఉన్న సత్యానికి సమాచారమిచ్చారు. హుటాహుటిన మిర్యాలగూడ చేరుకున్న ఆయన చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.