లంచావతారం బహురూపం | there is need controle corruption | Sakshi
Sakshi News home page

లంచావతారం బహురూపం

Published Sat, Sep 6 2014 1:04 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

there is need controle corruption

లంచం.. లంచం... ఈ రోజులలో లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగడం లేదు. ఏ శాఖలోనైనా చేయి తడిపితేనే ఫైళ్లు ముందుకు కదులుతున్నాయి. అప్పుడప్పుడు ఏసీబీ దాడులు జరుగుతున్నా లంచావతారులు భయపడడం లేదు. తాము తీసుకునే ముడుపులను వారు రకరకాల రూపాల్లో పొందుతూ సవాల్ విసురుతున్నారు. ఏసీబీ వలకు కిందిస్థాయి సిబ్బంది మాత్రమే చిక్కుతుండగా,  పై స్థాయి అధికారులు తప్పించుకుంటున్నారు.
 
కామారెడ్డికామారెడ్డి: అవినీతిలో మునిగి తేలుతున్న అధికారులు చట్టానికి చిక్కకుండా వివిధ రూపాలలో లంచాలు పొందుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్, ఎక్సైజ్,  పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్యం, విద్య, ట్రెజరీ, రిజిస్ట్రేషన్, వాణిజ్యపన్నులు తదితర శాఖలలో అవినీతి ఏరులై పారుతోం దనే విమర్శలున్నాయి. కామారెడ్డి డివిజన్‌లో అవి నీతికి అలవాటు పడిన కొందరు అధికారులు లంచం తీసుకోవడానికి కొత్త దారులు వెతుక్కుంటున్నారు. రాష్ట్రాభివృద్ధికి అవినీతే పెద్ద సవాల్‌గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పలుమార్లు ప్రకటించి, అవి నీతిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
 
భూముల్లో వాటాలు

రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు అత్యాశతో అసైన్డ్ భూములను కూడా ప్లాట్లుగా చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ భూములకు సంబంధించి ప్రభు త్వ పరంగా అన్ని రకాల క్లియరెన్సులు అందిస్తూ రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారు లు, సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణులు ఉన్నా యి. కామారెడ్డిలో రె వెన్యూ శాఖకు చెందిన ఓ ముఖ్య అధికారి నాలా కన్వర్షన్, అసైన్డ్ భూముల అన్యాక్రాం తం వంటి విషయాలలో అక్రమార్కులకు తనవంతు చేయూతనందిస్తూ రెండు చేతులా సంపాదించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
 
వివాదాలు ఉండే భూములకు సంబందించిన వ్యవహారాలలో ఒక అడు గు ముందుకేసి తనకూ వాటా కావాలని డిమా ండ్ చేసి పొందుతున్నారని అంటున్నారు. కొన్ని వెంచర్లలో సదరు అధికారికి వాటా దక్కినట్టు కూడా ప్రచారం జరిగింది. ఆయనపై అప్పట్లో జిల్లా అధికారులకు పిర్యా దులు కూడా వెళ్లాయి.  భిక్కనూరు, కామారెడ్డి మండలాల లో రూ. కోట్ల విలువైన అసైన్డ్ భూములకు సంబందించిన రికార్డులు తారుమారయ్యాయని, దీని కి సద రు అధికారే కారణమని తెలుస్తోంది.  
 
అడిగినంత ఇవ్వకుంటే అక్రమం.. ఇచ్చుకుంటే సక్రమం
మున్సిపల్ పరిధిలోని వివిధ విభాగాలలో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండాపోయింది. ముఖ్యంగా నిర్మాణాల విషయంలో అడిగినంత ఇస్తే ఏ అనుమతులు లేకున్నా నిర్మించుకోవచ్చని, ఇవ్వకుంటే అక్రమమని పేర్కొంటూ కూల్చివేయడం మున్సిపల్ అధికారులకు అలవాటుగా మారింది. మున్సిపల్ కార్యాలయం ముందరే అక్రమ అంతస్తుల నిర్మాణాలు సాగుతున్నా మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడ రు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా నోరుమెదపరు. ఎక్కడో ఎవరికి కనిపించన చోట అక్రమ నిర్మాణాలు సాగితే మాత్రం వాటిపై దాడులు నిర్వహిస్తారు. ఇటీవల సిరిసిల్ల రోడ్డులో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన సంఘటనకు బలమైన కారణాలే ఉన్నా యి. అధికారులు అడిగినంత ఇవ్వకపోవడంతోనే కూల్చివేతలు సాగినట్టు తెలుస్తోంది. కూల్చివేతల తరువాత బేరాలు సాగినట్టు సమాచారం.
 
పోలీసు శాఖలో రెండు వైపుల నుంచి....
కొందరు పోలీసు అధికారులు బాధితులు, నింది తులు రెండు వైపుల నుంచి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేమిటని అడిగితే ‘మేం డబ్బులు పెట్టి వచ్చామయ్యా’ అనే సమాధానం. కామారెడ్డి డివిజన్‌లో కొందరు అధికారులు అడ్డగోలు సంపాదనకు అలవాటు పడి అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారు.చిన్నచిన్న తగాదాలలో సైతం పెద్ద మొత్తంలో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇరువైపుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.
 
దీంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటే బాధితులు కూడా జంకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు అధికారులు నగదుకు బదులు నజరానాలు పొందుతున్నారు. విలువైన ఫర్నీచర్, ఫ్రిజ్‌లు, ఏసీలు, డైనింగ్ సామగ్రి, ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సామగ్రి, ఇంటీరియర్ డెకోరేషన్ వంటి వాటికి తమ లంచావతారాన్ని వాడుకుంటున్నారు. భారీ మొత్తంలో లంచాలు అందే సందర్భంలో ప్లాట్లు, ఫ్లాట్లను లంచంగా పొందుతు న్నారు. కొందరు నామినల్ ధరలకు తీసుకుంటున్నారు. అధికారుల ఇళ్లల్లో బర్త్‌డే ఫంక్షన్ల సందర్భంలో లంచాలు బంగారం రూపంలో పొందుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement