
ప్రతీకాత్మక చిత్రం
మహబూబ్‌నగర్ క్రైం: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ వద్దకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మేం పోలీసులమని చెప్పి తెలివిగా పుస్తెలతాడు అపహరించుకెళ్లారు. ఈ ఘటన శుక్రవారం జిల్లాకేంద్రంలో వెలుగుచూసింది. టూటౌన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని న్యూమోతీనగర్‌కు చెందిన లక్ష్మమ్మ శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో రాజేంద్రనగర్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా నిలోఫర్ ఆస్పత్రి వద్ద ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మేం పోలీసులమని, బంగారం అలా మెడలో వేసుకొని ఎలా.. దొంగలు ఎత్తుకెళ్తారని చెప్పి.. పేపర్‌లో పెట్టిస్తామని చెప్పడంతో ఆమె మెడలో ఉన్న నాలుగున్నర తులాల పుస్తెలతాడును వారికి ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరు అప్పటికే రాళ్లు పెట్టి ఉన్న పేపర్‌ను ఆమెకు ఇచ్చి.. బంగారంతో ఉడాయించారు. ఇంటికి వచ్చిన తర్వాత బాధితురాలు పేపర్ తెరిచి చూడగా రాళ్లు కనిపించడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment