గుర్రంపోడు : నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కట్టవారిగూడెం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. నల్లగొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. దేవరకొండ వైపు వెళుతున్న దేవరకొండ డిపో బస్సు, నల్లగొండ వైపు వెళుతున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.