కన్నీటి నడుమ కల్యాణం | three members are dead in road accident | Sakshi
Sakshi News home page

కన్నీటి నడుమ కల్యాణం

Published Sun, Dec 14 2014 2:59 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

కన్నీటి నడుమ కల్యాణం - Sakshi

కన్నీటి నడుమ కల్యాణం

విషాదం
 
అప్పటిదాకా కళకళలాడిన ఆ ఇల్లు....అంతలోనే కళావిహీనంగా మారింది.అందరి ఆనందం.. క్షణాల్లో ఆవిరైంది.మంగళవారుుద్యాలుమూగబోయూరుు.. రోదనలు మిన్నంటారుు.వైరా మండలం బ్రాహ్మణపల్లిలో శనివారం రాత్రి వివాహ వేడుక జరగాల్సిన ఓ ఇంట కొన్ని గంటలపాటు నెలకొన్న దృశ్యమిది.
 
వైరా/తల్లాడ: వైరా మండలం స్టేజి పినపాక వద్ద శుక్రవారం రాత్రి ఘోరం జరిగింది. పెళ్లి ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెం దారు. మరో 28మందికి గాయూలయ్యూరుు. బ్రాహ్మణపల్లికి చెందిన ఆది శ్రీకాంత్‌కు, తలా ్లడ మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతితో శుక్రవారం రాత్రి11:30 గంటలకు వరుడి ఇంటిలో వివాహం జరగాల్సుంది. ఈ వేడుకకు హాజరయ్యేందుకని వధువు స్వగ్రామమైన మంగాపురం నుంచి ఆమె బంధువులు, సన్నిహితులు ట్రాక్టర్ ట్రక్కులో బయల్దేరారు.

మరో పది నిమిషాల ప్రయూణం తరువాత వారంతా పెళ్లింటికి చేరుకునేవారు. వైరా మండలం స్టేజి పినపాక హైలెవల్ వంతెన వద్ద వీరి ట్రాక్టర్ ట్రక్కును వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ట్రక్కులోని వారంతా ఒక్కసారిగా వంతెన పైనుంచి కింద పడిపోయూరు. ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తె దగ్గరి బంధువులు గాదె లీలావతి(35), గాదె రమాదేవి(37) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో బంధువు పుప్పాల పద్మావతి(34) ఆస్పత్రిలో శనివారం మృతిచెందింది.

28 మందికి గాయూలు
ఏం జరిగిందో తెలియని స్థితిలో ట్రక్కులోని వారంతా హాహాకారాలు చేశారు. చెట్లు, పొదలతో కూడిన బ్రిడ్జి కింద భాగం(లోయ)లో వీరంతా పడిపోయూరు. మొత్తం 28మందికి గాయూల య్యూరుు. వీరంతా ఖమ్మంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మంగాపురం గ్రామస్తులు పరుచూరి మల్లమ్మ (వధువు నానమ్మ), పరుచూరి అప్పారావు, పరుచూరి చిన్న రెడ్డెయ్య, పద్మ, శ్రీలత, గాదె కృష్ణకుమారి, శైలజ, సునీత, లీలావతి, కుప్పాల శ్రీలత, తుటారి చిన్న లక్ష్మీనరసమ్మ, పరుచూరి రామారావు, మల్లెశెట్టి మమత, కటకి శ్రీలక్ష్మి, తుటారి విజయ, ఉమామహేశ్వర్‌రావు, మహాలక్ష్మి, కుంచం సుబ్బారావు, రమాదేవి, వెంకమ్మ, పరుచూరి సామ్రాజ్యం, నాగేశ్వర్‌రావు, మల్లవరం గ్రామస్తులు దుగ్గిదేవర సైదులు, నరసింహారావ, సారపాక గ్రామస్తు డు అభి ఉన్నారు. ఇదే వేడుకకు హాజరయ్యేం దుకని ద్విచక్ర వాహనంపై వస్తున్న తల్లాడ మండలం నారాయణపురం గ్రామస్తుడు వల్లాపురం రాంబాబుకు తీవ్ర గాయూలయ్యూరుు. ఇతని పరిస్థితి విషమంగాఉంది. ఇతని వాహనం ట్రాక్టర్ వెనుకగా వస్తోంది. ప్రమాద స్థలంలో ట్రాక్టర్‌ను ఇతని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇతని పరిస్థితి విషమంగా ఉంది.

స్తంభించిన ట్రాఫిక్
ఈ ప్రమాదంతో రోడ్డుకు ఇరువైపులా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించిం ది. వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని, క్షతగాత్రులను బయటకు తీరుుంచారు. 108 వాహనాల రాక ఆలస్యమవడంతో ద్విచక్ర వాహనాలపై, ఆటోల్లో క్షతగ్రాతులను వైరాలోని ప్రైవేట్ ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి పోలీసు లు తరలించి, కేసు నమోదు చేశారు.

కన్నీటిసంద్రంగా మంగాపురం..
ఈ ప్రమాదంతో మంగాపురం గ్రామం కన్నీటిసంద్రంగా మారింది. ఈ ప్రమాదంలో ఇదే గ్రా మానికి చెందిన సమీప బంధువులైన ముగ్గురు మృతిచెందారు. అనేకమందికి తీవ్ర గాయూల య్యూరుు. పోస్టుమార్టం అనంతరం శనివారం మంగాపురం తీసుకొచ్చిన మృతదేహాలను చూ సి కుటుంబీకులు, బంధువులు పెద్దపెట్టున రోదించారు.
 
కన్నీటి నడుమ కల్యాణం
ఈ ప్రమాద విషయం తెలిసేప్పటికి పెళ్లి ముహూర్తం సమీపించింది. దీంతో, ఒకవైపు రోదనలు మిన్నంటుతుండగానే వివాహాన్ని కొనసాగించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement