సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో మరో మూడు కొత్త కోర్సులు వచ్చే అవకాశముంది. ఈ మేరకు భారతీయ వైద్య మండలి అనుమతి కూడా లభించినట్టు వైద్య విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్(ఇమ్యునో హిమటాలజీ పాటు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్), ఎమర్జెన్సీ మెడిసిన్/ నియోనెటాలజీ కోర్సులు కొత్తగా రానున్నాయి. 2015-16 నుంచి వీటిని ప్రవేశపెట్టే అవకాశమున్నట్టు సమాచారం. ఇవి పీజీ లేదా పీజీ డిప్లొమా కోర్సులుగా ఉంటాయి. ప్రస్తుతం ఈ కోర్సులు చేసిన వైద్యులతో అవసరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని ప్రవేశ పెడుతున్నట్టు వైద్యశాఖ పేర్కొంది.