ముగ్గురి అరెస్టు.. రిమాండ్
మర్రిగూడ : పశువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న వారిలో ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు నాంపల్లి సీఐ ఈ.వెంకట్‌రెడ్డి తెలిపారు. మర్రిగూడ మండలంలోని తానేదార్‌పల్లి గ్రామ గుట్టల్లో పెద్ద పెద్ద పొయ్యిలను ఏర్పాటుచేసి పశువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న వైనంపై ఈ నెల ఒకటిన ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఆరాతీయగా మాంసంతో నూనె తయారు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో ఆ ముగ్గురిని సీఐ వెంకట్‌రెడ్డి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరిపై కేసు నమోదు చేసి దేవరకొండ కోర్టుకు రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో మర్రిగూడ ఎస్‌ఐ కె.మురళీమోహన్ తదితరులు ఉన్నారు.
‘పశువుల మాంసంతో నూనె తయారీ’ కేసులో...
Published Sat, Dec 6 2014 3:21 AM | Last Updated on Sat, Aug 11 2018 8:18 PM
Advertisement
Advertisement