2018 డిసెంబర్‌కు మూడు స్కైవేలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో నిర్మించాలను కుంటున్న 3 స్కైవేలను 2018 డిసెంబర్ నాటికి పూర్తిచేసే లక్ష్యంతో అందుకు తగ్గట్టుగా ప్రణా ళికలు రూపొందించాలని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. నగరంలో రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పన అంశాలపై గురువారం బంజారాహిల్స్ క్యాంప్ కార్యాలయంలో ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో పలు ప్రాంతాల్లోని ఎస్సార్ డీపీ(వ్యూహాత్మక రహదారుల ప్రాజెక్టు) పనులను వేగ వంతం చేయాలన్నారు. ఎస్సార్‌డీపీ పనుల కోసం రూ.2,691 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు లభించాయని చెప్పారు. ఈ నిధుల్లో ప్రాధాన్యత కింద తీసుకోవాల్సిన పను లపై ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు.
నగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులకు అవసరమైనన్ని నిధులిస్తామన్నారు. రాజీవ్ రహదారిపై తూముకుంట వరకు స్కైవే కోసం రక్షణ శాఖ భూములు అవసరం ఉన్నందున ఆ శాఖతో వేగంగా చర్చలు జరపాలని కేటీఆర్ ఆదేశించారు. జాతీ య రహదారుల శాఖతోనూ చర్చలు జరిపి నాగ్‌పూర్ హైవేపై నిర్మించే స్కైవే విషయంలో పూర్తిస్థాయి స్పష్టత కోసం ప్రయత్నించాలని సూచించారు.