సాక్షి, హైదరాబాద్: ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఫ్లైఓవర్లలో మరొకటి అందుబాటులోకి రానుంది. ఖాజాగూడ సైడ్ నుంచి మైండ్‌స్పేస్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీగా ఉండేందుకు బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే దీన్ని ప్రారంభించాలని ప్రభు త్వం భావిస్తోంది. ఈ నెల 4న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. వాస్తవానికి దీపావళికే ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలని అనుకున్నా... కొన్ని పనులు మిగిలిపోవడంతో వాయిదా పడింది. దాదాపు కిలోమీటర్ పొడవున మూడు లేన్లుగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక మెహిదీపట్నం నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే వారికి ఎంతో సమయం కలిసొస్తుంది.
ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. హైటెక్ సిటీ వైపు వెళ్లేవారు కూడా జంక్షన్ వద్ద ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. ఎస్సార్‌డీపీ పనుల 4వ ప్యాకేజీలో భాగంగా బయోడైవర్సి టీ వద్ద రెండు ఫ్లైఓవర్ల అంచనా వ్యయం రూ.69.47 కోట్లు కాగా.. ఇది రెండో వరుస ఫ్లైఓవర్. గచ్చిబౌలి వైపు నుంచి ఖాజాగూడ జంక్షన్ వైపు వెళ్లే మొదటి వరుస ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఐటీ కారి డార్ మార్గంలో ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు చేపట్టిన పనుల్లో అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ జంక్షన్ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. వీటివల్ల ట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. కొత్త ఫ్లైఓవర్‌తో మరికొంత సౌలభ్యం కలగనుంది. బయోడైవర్సిటీ వద్ద మొదటి వరుస ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తయితే జంక్షన్‌లో ట్రాఫిక్ చిక్కులుండవని అధికారులు చెబుతున్నారు. మరో ఆర్నెల్ల్లలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
పూర్తయిన ఫ్లైఓవర్ వివరాలివీ..పొడవు- 990
మీటర్లు వెడల్పు- 11.50
మీటర్లు లైన్లు- 3
పిల్లర్లు- 28
వయాడక్ట్ స్పాన్ పొడవు- 570
మీటర్లు అప్రోచెస్‌పొడవు- 255 మీటర్లు
జంక్షన్ వద్ద రద్దీ సమయంలో గంటకు వెళ్లే వాహనాల సంఖ్య 2015లో 14,001 ఉండగా
అది 2035 నాటికి 30,678కి చేరుకుంటుందని అంచనా
Comments
Please login to add a commentAdd a comment