Bio Diversity Park
-
లోపల ఊపిరి ఆడట్లేదు.. మమ్మల్ని బతకనివ్వండి ప్లీజ్
ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా ఉండే విశాఖ సముద్ర తీరం మృత్యు కుహరంగా మారిపోతోంది. నిత్యం కడలి కెరటాల ఘోష వినిపించే ప్రాంతం.. సముద్ర జీవరాశుల మృత కబేళాలతో నిండిపోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగర గర్భంలో ఉండే జీవరాశులు సైతం ఒడ్డుకు కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొంత కాలంగా విభిన్న జీవరాశులు విశాల విశాఖ తీరంలో ఎక్కడో ఒక చోట నిర్జీవంగా దర్శనమిస్తున్నాయి. లోతైన ప్రాంతాల్లో నివసించే సీ స్నేక్‌లతోపాటు విశాఖ తీరంలో అరుదైన డాల్ఫిన్లు ఆలివ్ రిడ్లే తాబేళ్లు, స్టింగ్రే(టేకు చేప), ముళ్లచేప మొదలైన జీవరాశులు మరణిస్తున్నాయి. సముద్ర జలాలు కలుషితం అవుతున్న కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ( చదవండి: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది ) సాక్షి, విశాఖపట్నం: వాతావరణంలో మార్పులను మానవ నివాసానికి అనుకూలంగా మార్చేవి సముద్రాలే. ఇందులోని జలాలు ఆవిరై వర్షాలుగా కురిసి నీటివనరులు అందేందుకు దోహదపడుతున్నాయి. మనిషి తీసుకునే ప్రోటీన్లలో సింహభాగం సముద్రం ఇస్తున్నదే. ఇన్ని ఇస్తున్న సాగరానికి.. తిరిగి మనమేం ఇస్తున్నామంటే కాలుష్య రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలే. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం విశాఖ సాగర తీరంలో 350 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా సముద్ర గర్భంలో కలుస్తున్నాయి. ( చదవండి: గిటారులో డ్రగ్స్.. అంతా బాగానే కవర్ చేశాడు.. కానీ.. ) ప్లాస్టిక్ సీగా మార్చేస్తున్నారు.. అందాల సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులే ప్రధాన సమస్యగా మారుతున్నారు. బీచ్ ఒడ్డున కూర్చొని.. తినుబండారాల్ని తినేసి ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లు సముద్రంలో పారేస్తున్నారు. ఇలా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కార్బన్ డయాక్సైడ్ మోతాదుకి మించి సముద్రాల్లో చేరుతుండటంతో ఆమ్లగాఢత పెరుగుతోంది. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విడుదలవుతున్న హైడ్రో క్లోరిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు చేపలకు హాని చేస్తోంది. సముద్ర గర్భం నుంచి ఒడ్డుకి తీసుకొచ్చిన వ్యర్థాలతో లివింగ్ అడ్వెంచర్స్ బృందం అడుగున ఉన్న ఆకర్షణీయమైన ప్లాస్టిక్ వ్యర్థాలు ఆహారంగా భావిస్తున్న జలచరాలు.. వాటిని తిని మృత్యువాత పడుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. సముద్ర జీవులు మనుగడ సాధించేందుకు జలాల్లో ఆక్సిజన్, ఉప్పు శాతాలు సక్రమంగా ఉండాలి. 8 నుంచి 10 పీపీటీ వరకూ ఆక్సిజన్ అవసరంకాగా.. 30 నుంచి 33 శాతం వరకూ లవణీయత ఉండాలి. కానీ విషపూరిత రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తుండటంతో అసమతుల్యత ఏర్పడి.. సరైన స్థాయిలో ఆక్సిజన్ అందక ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ వెలికితీస్తున్న స్వచ్ఛంద సంస్థలు సముద్ర జలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు జలచరాలకు ఎలాంటి హాని తలపెడుతున్నాయనే విషయంపై ప్రజల్లో అవగాహన శూన్యమనే చెప్పుకోవాలి. అందుకే.. సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాసిక్ వ్యర్థాల్ని తొలగించేందుకు లివిన్ అడ్వెంచర్ సంస్థతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. సముద్ర గర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కోసం ఈ బృందాలు 3 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్తున్నాయి. ఒడ్డు నుంచి ప్రారంభించి.. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యర్థాల్ని తొలగిస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. మరోవైపు సాగర జలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు విడిచిపెట్టకుండా తీరానికి వస్తున్న సందర్శకులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినా.. పర్యాటకుల నుంచి స్పందన కరువవడంతో జలచరాల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. ( చదవండి: CM Stalin: రూ.150కు చేరిన టమాటా.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం ) జీవవెవిధ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత ప్రజలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రంలో విసిరేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. సముద్రంలో ఉన్న ప్రాణులు చనిపోతూ కనిపిస్తుంటే మనసు తరుక్కుపోతోంది. అందుకే వెలికితీస్తున్నాం. మన సముద్రాన్ని మనం పరిరక్షించుకుందాం. ప్రజలు, సందర్శకులు కూడా దీనికి సహకరించాలి. ప్లాస్టిక్ సముద్ర ప్రాణుల్ని అంతరించిపోయేలా చేస్తోంది. ఇది జాతి మనుగడకే చాలా ముప్పు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పర్యాటకుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. – బలరాంనాయుడు, లివింగ్ అడ్వెంచర్స్ సంస్థ ప్రతినిధి చేపల శరీరాల్లోకి ప్లాస్టిక్ వ్యర్థాలు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్స్ సంస్థతో కలిసి ఎన్ఐవో చేసిన ఓ పరిశోధనలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేపల శరీరాల్లోకి వెళ్తున్నట్లు తెలిసింది. ఇది ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మెరైన్ పొల్యూషన్ అనేది కేవలం జలచరాలకే కాదు.. మానవాళి ఉనికికే పెను ముప్పు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోంది. పరిశ్రమల వ్యర్థాలపై కాలుష్య నియంత్రణ మండలితో పాటు జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్ఐఓ) కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. భూ ఉపరితలంతో పాటు సముద్ర తీరాల్ని కాపాడుకునే దిశగా విశాఖ ప్రజలు అడుగులు వేయాలి. – డా. కె.ఎస్.ఆర్.మూర్తి, ఎన్ఐవో విశ్రాంత శాస్త్రవేత్త చదవండి: సరదాగా కుటుంబంతో అత్తవారింటికి.. అంతలో దారుణం -
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ తిరిగి ప్రారంభం
గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై 42 రోజులు తరువాత వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఫ్లైఓవర్‌పై నుంచి వాహనాల రాకపోకలను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. అంతకు ముందు ఫ్లై ఓవర్‌ను సీపీ సజ్జనార్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. అనంతరం ఫ్లై ఓవర్‌పై నుంచి రాకపోకలను అనుమతించారు. Inspected the extra safety measures taken up as per the recommendations of the expert committee at the Biodiversity flyover along with @cpcybd @harichandanaias @CEProjectsGHMC. Driver’s desecration is imp. Have a safe drive. @KTRTRS @arvindkumar_ias @CommissionrGHMC @GHMCOnline pic.twitter.com/CJGtKHyXuw — BonthuRammohan,Mayor (@bonthurammohan) January 4, 2020 కాగా గత నవంబర్ 23న ఫ్లై ఓవర్‌పై కారు ప్రమాదం జరిగి సత్యవేణి అనే మహిళ మృతి చెందగా..మరో నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. అదే రోజు జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లై ఓవర్‌ను మూసివేశారు. రూ.69.47 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి గత నవంబర్ 4న ప్రాంభించారు. వారం రోజులు తిరగక ముందే నవంబర్ 10న అర్ధరాత్రి ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగుతుండగా ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ప్రవీణ్ (22), సాయి వంశీ రాజు(22) ఫ్లై ఓవర్‌పై నుంచి కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలతో జీహెచ్ఎంసీ అధికారులు దిద్దుబాటులో భాగంగా భద్రతా చర్యలు చేపట్టారు. నవంబర్ 23న శనివారం ప్రమాదం జరిగిన రోజు మూసివేసిన ఫ్లైఓవర్‌పై మళ్లీ శనివారమే రాకపోకలు ప్రారంభం కానుండటం గమనార్హం. రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై 1200కు పైగా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ఒక చోట రబ్బరు స్పీడ్ బ్రేకర్ వేశారు. 12 చోట్ల స్పీడ్ బ్రేకర్లుగా రంబుల్ స్ట్రిప్స్ వేశారు. ఫ్లై ఓవర్ పొడవునా నాలుగు వరుసలుగా తెల్లరంగు, ఎరుపు రంగు క్యాట్ ఐస్‌ను బిగించారు. ఫ్లైఓవర్ మధ్యలో ఎడమ వైపు సైడ్ వాల్‌పై రీలింగ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసే సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక మెటీరియల్‌తో ఫ్లైఓవర్‌పై స్పీడ్ లిమిట్ 40 కిలో మీటర్లు అని తెలిసేలా రంబుల్ స్ట్రిప్స్ వేశారు. -
విషాదం నింపిన ప్రమాదం
సాక్షి, పెంటపాడు: హైదరాబాద్ గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ జంక్షన్లో శనివారం జరిగిన ప్రమాదంలో పెంటపాడుకు చెందిన పసల సత్యవేణి(56) మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. సత్యవేణికి భర్త పసల సోమశేఖర్, కుమార్తెలు ప్రణీత, వాణి ఉన్నారు. ఆమె మృతదేహం ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చింది. ఆమె మృతి విషయాన్ని తెలుసుకున్న బంధువులు పెంటపాడుకు చేరుకున్నారు. మృతికి కారణమైన కారు డ్రైవర్‌కు తీవ్ర శిక్ష విధించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె బంధువులు కోరుతున్నారు. కుటుంబ నేపథ్యం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో పసల సూర్యచంద్రరావు శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ఆయన సోదరుని మనుమడైన సోమశేఖర్‌కు సత్యవేణితో వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రణీతకు రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. రెండో కుమార్తెకు హైదరాబాద్‌లో 6 నెలల క్రితం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో వారి కుటుంబం పెంటపాడు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చారు. హైదరాబాద్‌లోని మణికొండలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కాగా అక్కడి నుంచి హైటెక్ సిటీకి ఉద్యోగం కోసం వచ్చేందుకు ఆడపిల్లలకు ఇబ్బందులు ఎదురవడంతో కేపీహెచ్‌బీ కాలనీలో ఇల్లు చూసేందుకు సత్యవేణి శనివారం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఇక్కడ పెంటపాడులో వారి బంధువుల ఇళ్లలో విషాదఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్‌లో పోస్ట్‌మార్టం అనంతరం సత్యవేణి మృతదేహాన్ని స్వగ్రామం పెంటపాడుకు తరలించారు. మృతదేహం ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామానికి చేరగా అంత్యక్రియలు పూర్తిచేశారు. పలువురి పరామర్శ కాగా సత్యవేణి మృతితో ఆమె కుటుంబీకులను బంధువులు, స్నేహితులు పరామర్శించి సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, విప్పర్రు, ముదునూరు సొసైటీల మాజీ అధ్యక్షులు పసల అచ్యుతం, బండారు సత్యనారాయణ, కాపు సంఘ నాయకులు పాలూరి రాంబాబు, పెంటపాడు మండల వైసీపీ కనీ్వనర్ బండారు నాగు, ముదునూరు త్రిసభ్య కమిటీ సభ్యుడు జామి కృష్ణ, వైసీపీ జిల్లా నాయకులు నల్లమిల్లి విజయానందరెడ్డి, యూత్ అధ్యక్షుడు కొవ్వూరి విజయభాస్కరరెడ్డి తదితరులు పరామర్శించారు. -
రయ్.. రయ్
సాక్షి, హైదరాబాద్: ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ఫ్లైఓవర్లలో మరొకటి అందుబాటులోకి రానుంది. ఖాజాగూడ సైడ్ నుంచి మైండ్‌స్పేస్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీగా ఉండేందుకు బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే దీన్ని ప్రారంభించాలని ప్రభు త్వం భావిస్తోంది. ఈ నెల 4న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. వాస్తవానికి దీపావళికే ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలని అనుకున్నా... కొన్ని పనులు మిగిలిపోవడంతో వాయిదా పడింది. దాదాపు కిలోమీటర్ పొడవున మూడు లేన్లుగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక మెహిదీపట్నం నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే వారికి ఎంతో సమయం కలిసొస్తుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. హైటెక్ సిటీ వైపు వెళ్లేవారు కూడా జంక్షన్ వద్ద ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. ఎస్సార్డీపీ పనుల 4వ ప్యాకేజీలో భాగంగా బయోడైవర్సి టీ వద్ద రెండు ఫ్లైఓవర్ల అంచనా వ్యయం రూ.69.47 కోట్లు కాగా.. ఇది రెండో వరుస ఫ్లైఓవర్. గచ్చిబౌలి వైపు నుంచి ఖాజాగూడ జంక్షన్ వైపు వెళ్లే మొదటి వరుస ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఐటీ కారి డార్ మార్గంలో ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు చేపట్టిన పనుల్లో అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ జంక్షన్ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. వీటివల్ల ట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. కొత్త ఫ్లైఓవర్‌తో మరికొంత సౌలభ్యం కలగనుంది. బయోడైవర్సిటీ వద్ద మొదటి వరుస ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తయితే జంక్షన్లో ట్రాఫిక్ చిక్కులుండవని అధికారులు చెబుతున్నారు. మరో ఆర్నెల్ల్లలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. పూర్తయిన ఫ్లైఓవర్ వివరాలివీ..పొడవు- 990 మీటర్లు వెడల్పు- 11.50 మీటర్లు లైన్లు- 3 పిల్లర్లు- 28 వయాడక్ట్ స్పాన్ పొడవు- 570 మీటర్లు అప్రోచెస్పొడవు- 255 మీటర్లు జంక్షన్ వద్ద రద్దీ సమయంలో గంటకు వెళ్లే వాహనాల సంఖ్య 2015లో 14,001 ఉండగా అది 2035 నాటికి 30,678కి చేరుకుంటుందని అంచనా -
రాహ్‌గిరిలో టైటాన్స్ సందడి..
-
రాహ్‌గిరి.. ఆనందసిరి
-
సండే మనదే.. సందడి చేద్దాం..
-
‘రాహ్‌గిరి’ స్పెషల్..
-
వాహ్.. ‘రాహ్‌గిరి’