
సాక్షి, కరీంనగర్ : టిక్‌టాక్‌తో ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. గతంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పలువురు ఆన్‌డ్యూటీలో చేసిన టిక్‌టాక్ వీడియోలు వైరల్ కావడంతో అధికారులు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అయినా ఎలాంటి భయం లేకుండా కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ సీసీ రాకేశ్ టిక్‌టాక్ లాంటి లైక్ వీడియోలు చేస్తూ కార్యాలయంలో రిలాక్స్ అవుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అధికారులందరూ నిత్యం తమ విధుల్లో బిజీగా ఉంటారు. కానీ సీసీ రాకేశ్ మాత్రం లైక్ వీడియోలు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఉన్నతాధికారులు, కార్పొరేషన్ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ క్షణం తీరిక లేకుండా ఉండాల్సిన ఆయన ఏకంగా కార్యాలయంలోనే లైక్‌లో రొమాంటిక్ వీడియోలు, డైలాగులు చెబుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ప్రజలు, కార్పొరేటర్లు నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంటారు. వారికి సమాచారం ఇస్తూ ఉండాల్సిన కమిషనర్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రాకేశ్ కార్యాలయంలోని తన సీట్లో కూర్చొని సుమారు 8 వీడియోలు చేసినట్లు తెలుస్తోంది. మరి ఉన్నతాధికారులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment