
రాజాపేట: ఏడేళ్ల క్రితం తప్పిపోయిన ఓ యువకుడిని కొందరు యువకులు చేసిన టిక్‌టాక్ వీడియో తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన దుగ్గాపురం పద్మ, పెంటయ్యల కొడుకు ఖాసీం ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయాడు. ఈనెల 8న చల్లూరు గ్రామంలోని యువకులకు ఖాసీం కనిపించగా.. అతనికి మాటలు రాకపోవడంతో టిక్‌టాక్‌లో అతనితో కలసి దిగిన ఫొటోను పోస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.
ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చివరకు ఖాసీమ్ తల్లిదండ్రులకు తెలిసింది. తలకొండపల్లికి చెందిన తుమ్మ వీణ శనివారం సికింద్రాబాద్‌లో ఖాసీంను గుర్తించి అతడి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment