
గుళికల బ్యాగ్‌లో ఇసుక..?
ఆత్మకూరు(ఎం)
మండల కేంద్రంలోని ఓ ఎరువుల కంపెనీలో కొనుగోలు చేసిన గుళికల మందులో అధిక శాతం ఇసుక బయటపడింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చాడ గ్రామానికి చెందిన దొంతి శ్రీనివాస్ వరి చేనులో గుళికలను చల్లడానికి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ఓ ఎరువుల సెంటర్‌కు ఈ నెల 1న వె ళ్లాడు. ఓ కంపెనీకి చెందిన మాక్సిమాక్స్ ఆర్గానిక్ ప్లాంట్ ఎనిమిది కిలోల గుళికల ప్యాకెట్‌ను రూ.289ల ధర చెల్లించి కొనుగోలు చేశాడు.
దీంతో తాను శుక్రవారం ఉదయం వరి చేనులో చల్లడానికి విప్పి చూడగా గుళికల బ్యాగ్‌లో అధిక శాతం ఇసుక ఉంది. ఇసుక అధికంగా ఉండడంతో ఎరువుల సెంటర్‌కు వెళ్లి నిలదీయగా కంపెనీ ప్రతినిధులకు తెలియజేస్తామని సమాధానమిచ్చినట్లు బాధితుడు తెలిపారు. సదరు ఎరువుల కంపెనీపై చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి ఎస్. లావణ్యకు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.