శ్రీనివాస్ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
నల్లగొండ: తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో తలపెట్టిన మలి విడత పరామర్శ యాత్ర రెండోరోజు నల్లగొండ జిల్లాలో కొనసాగుతుంది. బుధవారం ఉదయం ఆలేరు మండలంలోని శారాజిపేట గ్రామంలో ఏదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారితో మాట్లాడి కష్టసుఖాలను ఆప్యాయంగా పంచుకున్నారు. అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో బీపీ గౌరమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి షర్మిల బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌తో పాటు రాష్ట్ర వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు.