Paramarsayatra
-
వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శయాత్ర
-
అండగా ఉంటాం..
- మహానేత తనయ షర్మిల భరోసా - అంజయ్య యాదవ్ కుటుంబానికి ఓదార్పు - కుటుంబ సభ్యుల్లో సంతోషం ‘మీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా... నన్ను కలవండి’ అంటూ మహానేత తనయ వైఎస్ షర్మిల ఇచ్చిన భరోసాతో ఆ కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఇంటి పెద్దను కోల్పోయి... ఆవేదనతో గడుపుతున్న ఆ కుటుంబ సభ్యుల్లో రాజన్న బిడ్డ మాటలు కొండంత ధైర్యాన్ని నింపాయి. సాక్షాత్తూ మహానేత తనయ తమ ఇంటికి రావడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడకు చెందిన అంజయ్య యాదవ్ తనువు చాలించాడు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులను సోమవారం షర్మిల పరామర్శించారు. పేరు పేరునా పలుకరించారు. వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. సాక్షి, సిటీబ్యూరో: షర్మిల : ఏమ్మా.. అంజయ్య యాదవ్ ఎలా చనిపోయారు? అంజమ్మ (అంజయ్య యాదవ్ భార్య): మా ఆయన వైఎస్సార్ వీరాభిమాని. మహానేత మరణించారని తెలిసి నాలుగు రోజుల పాటు అన్నం కూడా ముట్టలేదు. టీవీకే అతుక్కుపోయాడు. టీవీ చూస్తూనే సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. మమ్మల్ని వదిలి వెళ్లాడు... అంటూ కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుండగా... ఉద్విగ్నంగా చెప్పింది అంజమ్మ. షర్మిల: అంజయ్య యాదవ్ ఏం చేసేవారు? - ఎంత మంది పిల్లలు? అంజమ్మ: మా ఆయన నాంపల్లి పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో అటెండర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోడలు మరణించడంతో కొడుకు మరో పెళ్లి చేసుకున్నాడు. వాడి తొలి భార్యకు ఇద్దరు... ప్రస్తుత భార్యకు ఒకరు మొత్తం ముగ్గురు సంతానం. షర్మిల : వైఎస్సార్ అంటే యాదయ్యకు ఎందుకంత ఇష్టం? యాదగిరి (అంజయ్య యాదవ్ కుమారుడు): వైఎస్సార్ చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర సమయంలో మా నాన్న వీరాభిమానిగా మారారు. రాష్ట్రంలోని అరాచక, దుర్భిక్ష పరిస్థితులు వైఎస్సార్ముఖ్యమంత్రి అయితేనే మారతాయన్న విశ్వాసం ఆయనది. కాంగ్రెస్ పార్టీని పదేళ్ల పాటు రాష్ట్రంలో నిలబెట్టిన ఘనత ఆయనదేనన్నది నాన్న విశ్వాసం. మహానేతకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించలేకపోయేవారు. వైఎస్సార్‌కు సంబంధించిన వార్తలను టీవీలు, పేపర్లలో తదేకంగా చూసేవారు. ఆయన మరణవార్తను టీవీలో వింటున్నప్పుడే హఠాత్తుగా గుండెనొప్పితో కుప్పకూలారు. షర్మిల : ఏమ్మా... నీ కళ్లకు ఏమైంది? కంటి చూపు బాగుందా..? అంజమ్మ: లేదమ్మా. చిన్నప్పుడు కంటికి దెబ్బ తగిలితే చెట్ల మందులు వాడితే ఓ కన్ను చెడిపోయింది. మరో కన్ను మాత్రమే కనిపిస్తుంది. నా సొంత బిడ్డలా మా ఇంటికి వచ్చి బాధల్లో ఉన్న మమ్మల్ని పలకరించిన మిమ్మల్ని జీవితాంతం మరచిపోనమ్మా. షర్మిల : మీ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా నేనున్నా.. ఏ కష్టమొచ్చినా ఈ నెంబరుకు ఫోన్ చేయండి... అని విజిటింగ్ కార్డు ఇచ్చారు. వారందరి నుంచి సెలవు తీసుకొని మంఖాల్‌కు పయనమయ్యారు. దారి పొడవునా జనం, మహిళలు మహానేత తనయ షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు. జోహార్ వైఎస్సార్.. షర్మిలక్క నాయకత్వం వర్థిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పొరుగు గ్రామాల జనం రాకతో జిల్లెలగూడ గ్రామం జనసంద్రమైంది. ఊరిలోని అన్ని దారులూ కిక్కిరిసిపోయాయి. -
శ్రీనివాస్ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
నల్లగొండ: తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో తలపెట్టిన మలి విడత పరామర్శ యాత్ర రెండోరోజు నల్లగొండ జిల్లాలో కొనసాగుతుంది. బుధవారం ఉదయం ఆలేరు మండలంలోని శారాజిపేట గ్రామంలో ఏదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారితో మాట్లాడి కష్టసుఖాలను ఆప్యాయంగా పంచుకున్నారు. అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో బీపీ గౌరమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి షర్మిల బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌తో పాటు రాష్ట్ర వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. -
నేడు ఐదు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
నల్లగొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్రలో రెండోరోజు నల్లగొండ జిల్లాలో కొనసాగనుంది. ఈ రోజు ఐదు కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం ఆలేరు మండలం శరాజీపేటలో శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి మోత్కూరు మండలం పొడిచేడులో నర్సమ్మ కుటుంబానికి పరామర్శిస్తారు. ఆ తరువాత రామన్నపేట మండలం సిరిపురంలో వీరయ్య కుటుంబాన్ని పరామర్శించ నున్నారు. అలాగే కట్టంగూర్ మండలకేంద్రంలో రాములు కుటుంబాన్ని పరామర్శిస్తారు. భీమారంలో ఎన్. శేఖర్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. కాగా, వైఎస్ షర్మిల శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని 18 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున పరామర్శ యాత్రను చేపట్టిన షర్మిల.. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఇదివరకే యాత్రను నిర్వహించారు. -
'వైఎస్ఆర్ ... ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు'
నల్గొండ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి ఐదేళ్లయినా కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారని ఆ మహానేత తనయ వైఎస్ షర్మిల తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని పులిగిల్ల గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కనీవినీ ఎరుగని పథకాలకు రూపకల్పన చేసి.. వాటిని అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ... పేదల గురించి తన కన్నబిడ్డలకన్నా ఎక్కువగా ఆలోచించేవారన్నారు. ఆరోగ్య శ్రీ పథకం, 108 వాహనాల... ద్వారా లక్షల మంది ప్రజలకు వైఎస్ఆర్ పునర్జన్మను ప్రసాదించారన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ మహానుభావుడు మరణిస్తే కొన్ని వందల గుండెలు ఆగిపోయాయని తెలిపారు. రైతు, రైతు కూలీలను వైఎస్ఆర్ అన్ని విధాల ఆదుకున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. -
వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ప్రారంభం
-
వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ప్రారంభం
నల్గొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర మంగళవారం ప్రారంభమైంది. తొలుత బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీబీనగర్ మండలంలో పడమటిసోమారంలో బలరాం గౌడ్ కుటుంబాన్నిఆమె పరామర్శించారు. నాలుగు రోజులపాటు ఆరు నియోజకవర్గాల్లో కొనసాగనున్న షర్మిల పరామర్శయాత్రలో 18 కుటుంబాలను పరామర్శించనున్నారు. -
నేటి నుంచి షర్మిల పరామర్శయాత్ర
-
నేటి నుంచి షర్మిల పరామర్శయాత్ర
నల్లగొండ జిల్లాలో 4 రోజులపాటు పర్యటన ⇒ ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 కుటుంబాలకు పరామర్శ ⇒ వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్ సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో రెండో విడత యాత్రను మంగళవారం నుంచి చేపట్టనున్నారు. శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు ఆరు నియోజకవర్గాల్లోని 18 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున పరామర్శ యాత్రను చేపట్టిన షర్మిల.. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఇదివరకే యాత్రను నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో మిగిలిన భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలో పరామర్శ యాత్ర చేపట్టేందుకు మంగళవారం ఉద యం 9.30కు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ లోని తమ నివాసం నుంచి బయలుదేరుతారు. బుధవారం నుంచి యాత్ర ఇలా.. బుధవారం ఉదయం ఆలేరు నియోజకవర్గం లోని శారాజీపేటలో ఎదుల్ల శ్రీనివాస్ కుటుం బాన్ని షర్మిల పరామర్శిస్తారు. అక్కడి నుంచి తుంగతుర్తి నియోజకవర్గం పల్లెపహాడు, మోత్కూరు మీదుగా పొడిచేడు చేరుకుని దీటి గౌరమ్మ కుటుంబ సభ్యులను కలుసుకుం టారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మీదుగా సిరిపురం చేరుకుని పున్న వీరయ్య కుటుంబాన్ని, కట్టంగూరు టౌన్లో గాదగోని రాములు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత నకిరేకల్‌లోని మర్రూరుకు చేరుకుని పుట్ట సైదులు కుటుంబాన్ని కలుసుకుంటారు. ఇక గురువారం ఉదయం నకిరేకల్ నియోజకవర్గ భీమారంలో నెమ్మాది శేఖర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నల్లగొండ నియోజకవర్గం ఇందుగులకు చేరుకుని రాయించు నర్సింహ కుటుంబా న్ని, తిప్పర్తిలో గుంటి వెంకటేశం, చందనపల్లిలో చింతా భిక్షయ్య కుటుంబాన్ని, నల్లగొండ టౌన్లో బాండేకర్ దయానంద్ కుటుంబాన్ని కలుసుకుంటారు. శుక్రవారం ఉదయం కనగల్ చౌరస్తాలో వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూల మాల వేసి యాత్ర కొనసాగిస్తారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లికి చేరుకుని ఆస్తర్బీ, తాన్‌దార్‌పల్లిలో మునగాల పుల్లమ్మ కుటుంబాలను, తర్వాత చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిగ్ర వసంతరావు కుటుం బాన్ని పరామర్శిస్తారు. బీబీనగర్ వద్ద ప్రారంభం.. నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గ పరిధిలోని బీబీనగర్ టోల్గేట్ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి.. పరామర్శ యాత్రను ప్రారంభిస్తారని వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యద ర్శులు కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘బీబీనగర్‌లోని వెంకిర్యాలలో చెరుకు కిష్టయ్యగౌడ్ కుటుంబాన్ని తొలుత పరామర్శిస్తారు. అక్కడి నుంచి రాఘవాపురం, చిన్నరావులపల్లి, ఎర్రంబెల్లి, గౌస్‌నగర్ మీదుగా కంచనపల్లికి చేరుకుని అక్కడ కొలిచెల్మి అంజయ్య కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. భోజన విరామం అనంతరం బండ సోమారం, చాడ ఎక్స్‌రోడ్ మీదుగా ముస్త్యాలపల్లి చేరుకుని కళ్లెం నర్సయ్య కుటుంబాన్ని, అనంతరం ఆలేరు నియోజకవర్గంలోని దాతరుపల్లిలో ఎ.చంద్రమ్మ కుటుంబాన్ని, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు’’ అని వివరించారు. -
నేడు జిల్లాకు రాజన్న బిడ్డ
బీబీనగర్ మండలం నుంచి ప్రారంభం టోల్గేట్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్న వైఎస్ షర్మిల నాలుగు రోజులపాటు సాగనున్న యాత్ర 18 కుటుంబాలకు ఓదార్పు భువనగిరి : తన తండ్రి మరణం తట్టుకోలేక జిల్లాలో గుండెపగిలి మృతిచెందిన వారి కుటుంబాల్లో మనోస్థైర్యం కల్పించేందుకు రాజన్న బిడ్డ షర్మిల మలివిడత పరామర్శ యాత్ర మంగళవారంనుంచి ప్రారంభంకానుంది. 6 నియోజకవర్గాల్లో 18 మంది కుటుంబాలను కలుసుకుని వారి బాగోగులు తెలుసుకోనున్నారు. వారికి తమ కుటుం బం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మలి విడత పరామర్శ యాత్ర మంగళవారం నల్లగొండ జిల్లాలో ప్రారంభం కానుంది. భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్గేట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 12వ తేదీన మునుగోడు నియోజవర్గం చౌటుప్పల్‌లో ముగుస్తుంది. భువనగిరి, అలేరు. తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజవర్గాల్లో 18 కుటుం బాలను షర్మిల పరామర్శిస్తారు. వైఎస్సార్ మరణం తట్టుకోలేక జిల్లాలో 49 మంది చనిపోయారు. అందులో 32 కుంటుంబాలను గతంలోనే ఆమె పరామర్శించిన విషయం తెలిసిందే. షర్మిల పరామర్శ యాత్ర తొలిరోజు షెడ్యూల్.. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌నుంచి బయలుదేరుతారు. బీబీనగర్ మండలం గూడూరు టోల్ గేట్ వద్దగల వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి అక్కడినుంచి పరామర్శయాత్రకు వెళతారు. తొలిరోజు బీబీనగర్ మండలం వెంకిర్యాలలో గల చెర్కు కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడినుంచి వలిగొండ మండలం కంచనపల్లికి వెళ్లి కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని, భువనగిరి మండలం ముస్త్యాలపల్లికి చెందిన కల్లెం నర్సయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. ఇక్కడితో మూడు కుటుంబాల పరామర్శ పూర్తవుతుంది. ఇక్కడితో భువనగిరి నియోజకవర్గం యాత్ర పూర్తవుతుంది. ఆనంతరం ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామంలో ఎ.చంద్రమ్మ, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాలను పరామర్శిస్తారు. ఆలేరులో రాత్రి బస చేస్తారు. మలివిడత పరామర్శ యాత్రలో కలిసే కుటుంబాలు.. భువనగిరి నియోజకవర్గంలో బీబీనగర్ మండలం వెకిర్యాల గ్రామానికి చెందిన చెర్కు కిష్టయ్యగౌడ్ కుటుంబ ం వలిగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కొలిచెల్మి అంజయ్య కుటుంబం భువనగిరి మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన కళ్లెం నర్సయ్య కుటుంబ ం ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన ఎదుల్ల శ్రీనివాస్ కుటుంబం యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరిపల్లి గ్రామానికి చెందిన చింతల కృష్ణ కుటుంబ ం యాదగిరిగుట్ట మండలంలోని దాతరుపల్లి గ్రామానికి చెందిన ఎ.చంద్రమ్మ కుటుంబం తుంగతుర్తి నియోజకవర్గంలో మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామానికి చెందిన బీతి నర్సమ్మ కుటుంబం నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన పున్న వీరయ్య కుటుంబం కట్టంగూరు మండలంలోని కేంద్రం గ్రామానికి చెందిన గాదగోని రాములు కుటుంబం నకిరేకల్ మండలంలోని మర్రూర్ గ్రామానికి చెందిన పుట్ట సైదులు నెమ్మాది శేఖర్ కుటుంబం నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన చింతా భిక్షమయ్య కుటుంబం తిప్పర్తి మండలం కేంద్రానికి చెందిన గుంటి వెంకటేశం కుటుంబం తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రాయించు నర్సింహ కుటుంబం నల్లగొండ పట్టణంలో దండేకార్ దయానంద్ కుటుంబం మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడెం మండలం తాన్‌దార్‌పల్లి గ్రామానికి చెందిన మునగాల పుల్లమ్మ కుటుంబ ం నాంపల్లి మండలం నాంపల్లికి చెందిన అస్తర్బీ కుటుంబం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బిట్ర వసంతరావు కుటుంబ ం. పరామర్శ యాత్ర తొలిరోజు షెడ్యూల్.. మొదట గూడూరు టోల్గేట్ వద్దగల వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తారు. బీబీనగర్ మండలం వెంకిర్యాలలో చెర్కు కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. వలిగొండ మండలం కంచనపల్లిలో కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని కలుసుకుంటారు. భువనగిరి మండలం ముస్త్యాలపల్లికి చెందిన నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లిలో ఎ.చంద్రమ్మ, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాలను పరామర్శిస్తారు. -
జనవరిలో షర్మిల పరామర్శ యాత్ర
నల్లగొండ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర జిల్లాలో చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి మర ణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించేందుకు త్వరలో జిలాల్లో పర్యటించేందుకు పార్టీపరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డితో జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. షర్మిల పరామర్శ యాత్రతో పాటు, జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణం, కొత్తగా నియమించాల్సిన కమిటీల గురించి చర్చిం చారు. షర్మిల పరామర్శ యాత్ర మొదట ఈ నెలలో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభమవుతుంది. అక్కడ యాత్ర ము గిసిన అనంతరం జిల్లాలో కొనసాగించనున్నారు. పార్టీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అన్ని సవ్యంగా సాగితే జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరి మొదటివారంలో షర్మిల పరామర్శ యాత్ర జిల్లాలో చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే పరామర్శయాత్ర కంటే ముందుగానే జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి జగన్‌తో కూలంకషంగా చర్చించారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుని జిల్లాలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. ముందుగా గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా కమిటీలు, ఆతర్వాత జిల్లా కమిటీ ఎన్నిక ఉంటుంది. త్వరలో దీనికి సంబంధించిన షెడ్యూల్.. పార్టీ తరఫున అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే పార్టీలో ఎలాంటి మార్పులు చేయాలి...? ఎలాంటి నాయకత్వానికి ప్రాధాన్యమివ్వాలి అనే అంశాలు, వివిధ నియోజవర్గాల్లో పార్టీ తాజా స్థితి గతుల పైనే జగన్‌కు శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. పార్టీ ప్రక్షాళన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి పోరాటాల రూపకల్పన, షర్మిల పరామర్శ యాత్ర విజయవంతం చే సే దిశగా పార్టీ యాక్షన్ ప్లాన్ ఉండబోతున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి.