
వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ప్రారంభం
నల్గొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర మంగళవారం ప్రారంభమైంది.
తొలుత బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీబీనగర్ మండలంలో పడమటిసోమారంలో బలరాం గౌడ్ కుటుంబాన్నిఆమె పరామర్శించారు. నాలుగు రోజులపాటు ఆరు నియోజకవర్గాల్లో కొనసాగనున్న షర్మిల పరామర్శయాత్రలో 18 కుటుంబాలను పరామర్శించనున్నారు.