చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
Published Fri, Jan 8 2016 1:50 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
రామడుగు : తాటి చెట్టు పైకి ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు అక్కడి నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండారి కొమరయ్య(50) గీత కార్మికుడు. ఈ క్రమంలో ఈ రోజు కల్లు గీసేందుకు తాడి చెట్టుపై ఎక్కాడు. అయితే ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement