వైఎస్సార్ సీపీ జిల్లా సమావేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నట్టు కేంద్ర పాలక మండలి సభ్యుడు కొండా రాఘవరెడ్డి, జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ శనివారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.
ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రేటర్‌లోని 48 డివిజన్ల కార్యవర్గం కూడా సమావేశానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో సమీక్షించనున్నట్లు శేఖర్‌గౌడ్, కొండా తెలిపారు.