district meeting
-
విజయం మనదే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కొంతకాలంగా రాష్ట్రంలో రెండే ప్రధాన చర్చలు. ఒకటి రజనీ పార్టీ, రెండోది కమల్ పార్టీ. వీటిల్లో కమల్‌హాసన్ పార్టీ ఎప్పుడు...ఏమిటి...ఎలా అనే చర్చకు ఈనెల 21వ తేదీన తెరపడింది. మక్కల్ నీది మయ్యం అని పార్టీ పేరును ప్రకటించిన కమల్‌హాసన్ తరువాత కార్యాచరణ ప్రణాళికలో ఉన్నారు. ఇక మిగిలింది రజనీకాంత్ పార్టీ. ‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం’ అని గత నెలలో ప్రకటించడం ద్వారా కొన్ని ఊహాగానాలకు తావులేకుండా చేశారు. అయితే పార్టీ పేరు, పతాకం, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎప్పుడో రజనీ చెప్పడం లేదు. సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకాలు సాగిస్తున్నారు. ఎవరు ముందా అని ప్రజలు ఎదురుచూస్తుండగా ఈనెల 21న కమల్ తన పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. దీంతో ఇక రజనీవంతైంది. జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకాల్లో భాగంగా ఈనెల 20 నుంచి ‘రజనీకాంత్ ప్రజా సంఘం’ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో కాంచీపురం, విల్లుపురం, కడలూరు జిల్లాల ఇన్‌చార్జ్‌ల ఎంపిక కార్యక్రమం జరిగింది. జాతీయ ఇన్‌చార్జ్‌లు నిర్వహించే ఈ సమావేశాలకు రజనీకాంత్ హాజరుకావడం లేదు. సుదూర జిల్లా నుంచి వచ్చే అభిమానులు రజనీని చూడలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అయితే ఈనెల 21న కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని ప్రకటించి తన కంటే ఒక అడుగు ముందుకు వేయడంతో రజనీ కూడా జోరు పెంచారు. చెన్నై రాఘవేంద్ర కల్యాణ మండపంలో శుక్రవారం తిరునెల్వేలి జిల్లా సమావేశాలు జరుగుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో రజనీకాంత్ అకస్మాత్తుగా హాజరయ్యారు. రజనీ వస్తారని ఏ మాత్రం ఎదురుచూడని అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 32 ఏళ్ల చరిత్ర కలిగిన అభిమానుల సంఘాల నుంచి మా పార్టీ ఉద్బవిస్తోంది. తాము ఇప్పుడు చేసేదల్లా వాటిని మరింత బలోపేతం చేయడం. నా అభిమానులకు ఎవ్వరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. నా అభిమానులే ఇతరులకు పాఠం చెప్పగలరు. ఏమి చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం జరుపుకుంటూ రాజకీయాల్లో మార్పు తేవడం సాధ్యం అనే నమ్మకం నాకుంది. అనంతరం మీడియాతో మాట్లాడారు. కమల్ నిర్వహించిన బహిరంగసభ బాగుంది, కమల్‌కు ముందుగానే నేను శుభాకాంక్షలు చెప్పాను. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీలూ కలిసి పోరాడాలి. అన్ని జిల్లాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తికాగానే రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తాను. రజనీ ఏమిటి ఇలా మౌనంగా ఉన్నారని కొంతమంది విమర్శిస్తున్నారు, వారిని అలానే విమర్శించనీయండి, మన పనిలో మనం ఉందాం. నేను కుటుంబ పెద్దగా సరిగ్గా ఉన్నాను, మనమంతా ఒక కుటుంబంలా ముందుకు సాగుతున్నాం. 32 జిల్లాల ఇన్‌చార్జ్‌లను ఒకేసారి కలుసుకునేందుకు కొద్దిరోజులవుతుంది. అన్ని జిల్లాల నియామకం పూర్తికాగానే రాష్ట్రపర్యటన తేదీలను ఖరారు చేస్తాను. కావేరీ జలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎడపాడి అఖిలపక్ష సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాని చెప్పారు. -
సీపీఎస్ రద్దుకు జాతీయ స్థాయిలో పోరాటం
భీమవరం టౌన్:కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఐక్య వేదికలను నిర్మించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అధ్యక్షతన ఆదివారం జిల్లా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఉన్న పాత పెన్షన్ సౌకర్యాన్ని 2004 తరువాత ఉద్యోగాల్లో చేరిన వారికి రద్దు చేసి సీపీఎస్ విధానం అమలు చేయడం సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దమన్నారు. పాత పెన్షన్స్కీమ్ను అందరికీ వర్తింప చేయాలని కోరుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మిక సంఘాలతో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చర్చించడం తప్ప పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించాఉ. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన నియమ నిబంధనలు డ్రాఫ్ట్ రూల్స్‌ను విద్యాశాఖ కమిషనర్ విడుదల చేసి గత నెల 8వ తేదిన అన్ని సంఘాలతో చర్చించి అభిప్రాయాలు తీసుకుంటారన్నారు. అయితే ఏకపక్షంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన విధంగా బదిలీల్లో లాంగ్ స్టాండింగ్ 8 ఏళ్లు ఉంచాలని, వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్దతిలోనే మాన్యుల్ కౌన్సిల్ నిర్వహించాలని, పాయింట్లు కేటాయించడంలో ఫెర్పార్మెన్స్ విధానాన్ని తొలగించి, పాత పద్దతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో సమస్య పరిష్కారం కోరుతూ ఫ్యాఫ్టో, జాక్టో సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదిన టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీ మూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యమనేత సుబ్బరాజు శతజయంతి సభను ఈనెల 11న పోడూరు మండలం జిన్నూరులో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతీ ఒక్కరూ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.జయప్రభ మాట్లాడుతూ మునిసిపల్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియంతోపాటు తెలుగు మీడియంలోనూ తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీవీ నర్సింహరావు, జిల్లా నాయకులు సీహెచ్.జగన్మోహనరావు, బి.సుబ్బలక్ష్మి, ఏకేవీ రామభద్రం, ఆర్.రవికుమార్, ఎంఐ విజయ్‌కుమార్, పి.శివప్రసాద్, సుబ్రహ్మణ్యం, పి.శ్రీనివాస్, సువర్ణరాజు, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నేడు మానిటరింగ్ కమిటీ సమావేశం
ముకరంపుర: జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ తెలిపారు. మానిటరింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కో చైర్మన్లు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎంపీలు బాల్కసుమన్, కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 28 శాఖల అధికారులతో సమీక్షించనున్నారని తెలిపారు. సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్‌ప్సన్ హాజరవుతారని తెలిపారు. ఎంపీపీలు హాజరు కావాలని కోరారు. -
మాట నిలుపుకుందాం
♦ 27న ప్రతి పల్లెలో జెండా.. ప్రతి ఇంటా పండగ ♦ సబిత, జైపాల్‌లు జిల్లాకు ఒరగబెట్టిందేమీలేదు ♦ విపక్షాల విమర్శలను తిప్పికొట్టండి ♦ ఉద్యమకారులకు నామినేటెడ్ పదవులు ♦ టీఆర్ఎస్ జిల్లా సమావేశంలో ఎంపీ కవిత సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రతి పల్లెలో గులాబీ జెండా.. ప్రతి ఇంట్లో పండగలా పార్టీ అవిర్భావం దినోత్సవం నిర్వహించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ‘15వ వసంతంలోకి అడుగిడుతున్న టీఆర్ఎస్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.. అఖండ విజయాన్ని సాధించింది.. ప్రజలిచ్చిన ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి.. వారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ముందుకు సాగాల్సిన అవరముంది’ అని ఆమె అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేసీఆర్ చెప్పే ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. కేసీఆర్ ఒక్కసారి చెప్పినా.. వందసార్లు చెప్పినట్లేనని ..విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు వెనుకాడవద్దని అన్నారు. పట్టుదల, లక్ష్యసాధనకు పార్టీ అధినేతే నిలువెత్తు నిదర్శనమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తొలుత పార్టీ.. తర్వాతే ప్రభుత్వం అని గుర్తెరిగి మసులుకోవాలని పిలుపునిచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాణహితకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించారు. చేవెళ్ల చెల్లెమ్మ సబితక్కకు మంత్రి పదవి ఇచ్చినా వైఎస్..నిధులను ఆంధ్రాకు మళ్లించుకుపోయారని ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కేవలం రూ.26 కోట్లు విడుదల చేసి.. రూ.176 కోట్లు వ్యర్ధం చేశారని సబిత అసత్యప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. చేవెళ్ల ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన జై పాల్‌రెడ్డి కేంద్రంలో మూడు పదవులు నిర్వర్తించినా..జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని విరుచుకుపడ్డారు. జిల్లాలో పార్టీకి ఒక్కరూ మిగిలారని, వారంతా పంగనామాల పార్టీల సభ్యులని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పార్టీలకతీతంగా అన్ని నియోజకవర్గాలను సమానదృష్టితో చూస్తున్నామని, నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్షకు తావివ్వడంలేదని అన్నారు. ఆదారబాదరగా పదవులు వద్దు పనిచేయాలనుకునే వాళ్లే టీఆర్ఎస్లోకి వస్తున్నారు. పాత, కొత్త విభేదాలొద్దు. అధికారంలో ఉంటేనే ప్రజ లకు సేవ చేయగలం అని కవిత స్పష్టం చేశారు. ఆదారబాదరగా పదవులు పంపిణీ చేయవద్దని.. పాత, కొత్త నేతల మేళవింపుతో పదవుల పంపకం చేపట్టాలని సూచించారు. జైలు, లాఠీ దెబ్బలు తిన్న ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగలేదని, వారిని నామినేటెడ్ పదవుల్లో పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుందని అన్నారు. మన కు నాయకులు కాదు.. పార్టీయే ముఖ్యం. గులాబీ కండువా తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని కవిత అన్నారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... గ్రేటర్లో 59 డివిజన్లు గెలిచి జిల్లాలో పార్టీ సత్తా చూపామని.. ఈ విజయాలు టీఆర్ఎస్ సమష్టి నాయకత్వానికి నిదర్శమని అన్నారు. రాజకీయ పార్టీగా అవతరించిన ఉద్యమ పార్టీ..మరో 20 ఏళ్లు అధికారంలో ఉండేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు కాలం చెల్లిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాటుపడతామని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, శంబీపూర్ రాజు, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, తదితరులు పాల్గొన్నారు. -
రేపు వైఎస్సార్ సీపీ జిల్లా సమావేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నట్టు కేంద్ర పాలక మండలి సభ్యుడు కొండా రాఘవరెడ్డి, జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ శనివారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రేటర్‌లోని 48 డివిజన్ల కార్యవర్గం కూడా సమావేశానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో సమీక్షించనున్నట్లు శేఖర్‌గౌడ్, కొండా తెలిపారు. -
30న ‘అరుణోదయ’ జిల్లా సదస్సు
నకిరేకల్, న్యూస్‌లైన్: ఈ నెల 30న నల్లగొండలోని టౌన్హాల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్లు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలం సంతోష్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్సూర్, పల్స నిర్మల తెలిపారు. సదస్సుకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం నకిరేకల్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ 30వ తేదీన ఉదయం 11 గంటలకు టౌన్‌హల్‌లో జిల్లా సదస్సు, సాయంత్రం 6 గంటలకు క్లాక్‌టవర్ తెలంగాణ చౌక్ వద్ద బహిరంగా సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సదస్సుకు జిల్లాలోని వివిధ రంగాల కళాకారులు 200 మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సమాఖ్య రాష్ట్ర , జిల్లా కమిటీల నియామకం, భవిష్యత్ లక్ష్యా ల కోసం సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా విమలక్క, కవి,పరిశోధకుడు జయధీర్, తెలంగాణ జేఏసీ కోచైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మకంటి కొమరయ్య, పీడీఎస్‌యూ జిల్లా కన్వీనర్ ఆవుల నాగరాజు, జిల్లా నాయకులు యానాల లింగారెడ్డి, పల్సగిరి, బోడ్డు శంకర్, మిట్టా నర్సిరెడ్డి, రంగన్న, రామలింగయ్య, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.