మూడు బ్యాంకులతో ఒప్పందానికి ఆర్థిక శాఖ అనుమతి
హైదరాబాద్: విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా మూడు జాతీయ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఖజానా శాఖకు తాజాగా అనుమతి లభించింది. అపాయింటెడ్ డే అయి న జూన్ రెండో తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వ లావాదేవీలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి వీలుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రెవెన్యూ వసూళ్లు, ఉద్యోగుల వేతనాల చెల్లింపులు తదితర ప్రక్రియను ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ద్వారా రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది.
కొత్తగా ఏర్పా టు కానున్న తెలంగాణకు సంబంధించి కూడా ఈ మూడు జాతీయ బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ మేరకు ప్రస్తుత డీటీఏకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌కల్లం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తెలంగాణకు ప్రత్యేకంగా ‘ట్రెజరీ.తెలంగాణ.జీవోవి.ఐఎన్’ పోర్టల్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్‌ఐసీ)లో నమోదు చే సుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ ప్రభుత్వ పోర్టల్‌గా ‘తెలంగాణ.జీవోవి.ఐఎన్’ డొమైన్‌ను వినియోగించేలా ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి
తెలంగాణ లావాదేవీలకు లైన్ క్లియర్!
Published Wed, May 21 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM
Advertisement
Advertisement