డబుల్ డెక్కర్ రైలు ట్రయల్ రన్ | Trial run of the double-decker train | Sakshi
Sakshi News home page

డబుల్ డెక్కర్ రైలు ట్రయల్ రన్

Published Tue, Aug 5 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

డబుల్ డెక్కర్ రైలు ట్రయల్ రన్

డబుల్ డెక్కర్ రైలు ట్రయల్ రన్

కాజీపేటరూరల్/డోర్నకల్/కేసముద్రం/నెక్కొండ/మహబూబాబాద్ : ఇప్పటివరకు మనమంతా డబుల్ డెక్కర్ బ స్సు, డబుల్ డెక్కర్ విమానం గురించి విన్నాం. కానీ.. ప్రస్తుతం మన ముందుకు డబుల్ డెక్కర్ రైలు కూడా వచ్చిం ది. వివరాల్లోకి వెళితే.. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 2012 రైల్వేబడ్జెట్‌లో సికింద్రాబాద్ డివిజ న్‌కు ప్రభుత్వం రెండు డబుల్ డెక్కర్ రైళ్లు మంజూరు చేసింది. ఇందులో కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-గుంటూరు వరకు వయా నడికుడి మీదుగా నడిపించేందుకు అధి కారు లు నిర్ణయించారు. వీటిలో ప్రస్తుతం కాచిగూడ నుంచి తిరుపతి వరకు మాత్రమే ఒక డబుల్ డెక్కర్‌ను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  
 
ఇదిలా ఉండగా, రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన డబుల్‌డెక్కర్ రైలు సోమవారం కాజీపేట, డోర్నకల్ జంక్షన్ పరిధిలోని రైలు పట్టాలపై పరుగులు తీయడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు.  గుంటూరు నుంచి కాచిగూడ మీదుగా తిరుపతికి నడిపిస్తున్న డబుల్‌డెక్కర్ రైలు  జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఆగి ఉండడంతో దానిని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇదిలా ఉండగా, రైలులోని బోగీలు వెడల్పుగా ఉండడంతోపాటు సాధారణ బోగీల కంటే ఎత్తు కొద్దిగా ఎక్కువ ఉంది. అలాగే రైలులో మొత్తం 17 బోగీలు ఉండగా, ఒక్కో బోగీలో రెండు అంతస్తులు కలిపి 120 సీట్లు ఉన్నాయి.
 
కాగా, ఈ డబుల్‌డెక్కర్ రైలును త్వరలో సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు, కాజీపేట నుంచి విజయవాడకు నడిపించే అవకాశం ఉండడంతో ముందస్తుగా అధికారులు ట్రయల్న్ర్ నిర్వహించి నట్టు సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా, రైలును కాజీపే ట, డోర్నకల్ జంక్షన్లలో ప్రతి స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాల మీదుగా నడిపించి పరీక్షించారు. బోగీలకు కెమెరాలను అమర్చి ప్లాట్‌ఫారం, బోగీల మధ్య ఉన్న ప్రదేశాన్ని పరి శీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement