
పురుగు మందుతో బావిలోకి దూకిన గిరిజనులు..
వరంగల్ జిల్లాలో ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, భూపాలపల్లి, రేగొండ, తాడ్వాయి, గూడూరు, ఖానాపురం, మహబూబాబాద్ మండలాల్లో గిరిజనులు 40 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నారు. గూడూరు మండలం బొద్దుగొండ శివారు ఎర్రకుంట తండా, కొంగరగిద్ద గిరిజన రైతులు సాగుకోసం ఏనాడో తవ్వుకున్న బావుల పూడ్చివేతకు ఈ నెల 16న అటవీ శాఖ అధికారులు ప్రయత్నించారు. బుల్‌డోజర్‌తో చేరుకున్న 60 మంది అటవీ సిబ్బందిని గిరిజ నులు అడ్డుకున్నారు.
వర్షాభావం కారణంగా అప్పులు చేసి బావులను 3 నెలల కిందట పూడిక తీయించామని గిరిజనులు వాపోతోంటే.. అధికారులు మాత్రం అవి అట వీ భూమిలో తవ్విన బావులని, వాటిని మూసేస్తామని భీష్మించారు. చివరికి గిరిజనులు పలువురు ఆత్మహత్య చేసుకుంటామంటూ పురుగు మందు డబ్బాలు పట్టుకుని, బావిలోకి దూకటంతో అధికారులు వెనుదిరిగారు.
వరంగల్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ శివారు ఎర్రకుంట తండాలో పూడ్చివేతను ఆపకపోతే పురుగు మందు తాగి చస్తామని బావిలో దూకిన గిరిజనులు