ట్రాలీఆటో బోల్తాపడి విద్యార్థి దుర్మరణం | Trollyauto rolldown and a studend died | Sakshi
Sakshi News home page

ట్రాలీఆటో బోల్తాపడి విద్యార్థి దుర్మరణం

Published Tue, May 5 2015 2:34 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

Trollyauto rolldown and a studend died

- మరో 23మందికి గాయూలు
- ఇద్దరి పరిస్థితి విషమం
- మామిడికాయలు తెంపేందుకు వెళ్తుండగా ప్రమాదం                  
కొత్తకొండ(భీమదేవరపల్లి) :
కూలీ పనుల నిమిత్తంమా మిడికాయలు తెంపేందుకు వెళ్తండగా అదుపుతప్పి ట్రాలీఆటో బోల్తాపడి గుగులోతు జీవన్(14) అనే విద్యార్థి దుర్మరణం చెందాడు. మరో 23మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని మల్లారం గ్రామపంచాయతీ పరిధి వీర్లగడ్డతండా కు చెందిన 25మంది గిరిజనులు కొత్తకొండకు చెందిన ట్రాలీఆటలో వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో మామిడికాయలు తెంపేందుకు సోమవారం బయలు దేరారు. కొ త్తకొండ విద్యుత్ సబ్‌స్టేషన్ దాటగానే తారురోడ్డు ఏట వాలుగా ఉండడం, వాహనం వేగంగా వెళ్లడంతో అదపుతప్పి బొల్తాపడింది.

ఈఘటనలో గుగులోతు జీవన్(14), గుగులోతు సరోజన, గుగులోతు జమున, గుగులోతు విజయ, గున్నీ, బుజ్జమ్మ, రాకేష్, గుమ్మ, బానో తు లక్ష్మి, స్వర్ణ, తిరుపతి, గణేష్, మంగమ్మ, సత్తమ్మ, శారద, కమల, ఉపేందర్, లక్ష్మి, గుగులోతు ధూళి, జ్యో తితోపాటు మరో నలుగురికి గాయూలయ్యూరుు. ఇంకో బాలుడు గుగులోతు రాజ్‌కుమార్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అరుుతే, తీవ్రంగా గాయపడిన గుగులోతు జీవన్, గుగులోతు సరోజన, గుగులోతు జమున, గుగులోతు రాకేశ్, గుగులోతు గున్నీని స్థానికులు 108అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. జీవన్ చికిత్స పొందుతూ మృతి చెం దాడు. గుగులోతు సరోజన, గుగులోతు జమున పరిస్థి తి విషమంగా ఉంది. మిగతా 19 మందిని ముల్కనూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేరుుస్తున్నారు. గాయపడిన వారి రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది.

‘అమ్మమ్మ ఇంటికి పోతే బతికటోడు’
‘అమ్మమ్మ ఇంటికి పోతనంటివి కదా కొడుకా.. ఆడికి పోయినా బతికటోడివి కదా బిడ్డా..’ అంటూ రోడ్డు ప్ర మాదంలో మృతి చెందిన గుగులోతు జీవన్ తల్లి రాధ రోదించిన తీరు పలువురిని కలిచివేసింది. గుగులోతు రాజేందర్-రాధ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జీవన్ హుజూరాబాద్‌లోని వసతిగృహంలో ఎనిమిదో తరగతి చదువుచున్నాడు. వేసవి సెలవులు ప్రకటించడంతో స్వగ్రామం చేరాడు. సోమవారం అ మ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పిన జీవన్.. కూలీకి పోతే రూ.150 వస్తుందనే ఆశతో మామిడికాయలు తెంపేం దుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. రెక్కాడితేగాని డొక్కాడని పేద గిరిజన కుటుంబాలు.. పొట్ట కూటి కోసం కూలీకి వెళ్తూ రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. ఈ ఘట న వీర్లగడ్డతండాలో విషాదం నింపింది. కాగా, ఆటో డ్రైవర్ చింత సునీల్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేశామని ముల్కనూర్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

పరిహారం చెల్లించాలని మృతదేహంతో ధర్నా
తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్య తీపుకుని పరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో జీవన్ కుటుంబ సభ్యులు జీవన్ మృతదేహంతో ముల్కనూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రి సమీపంలో రెండుగంటలపాటు ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న సీఐ సదన్‌కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement