బీబీనగర్ : మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి
సాక్షి,బీబీనగర్ : తెలంగాణపై అధిపత్యం కోసం చంద్రబాబుతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీని ఈఎన్నికల్లో బొంద పెట్టాలని భువనగిరి నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గూడూరు గ్రామంలో బుదవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు తీరని అన్యా యం చేసి ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు మళ్లీ ఈప్రాంతంపై అధిపత్యం చెలాయించడం కోసం రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సందీప్‌రెడ్డి, గోళి పింగళ్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ఎంపీటీసీ అలివేలశ్రీనివాస్, మాజీ సర్పంచ్ కవిత, నాయకులు శేఖర్‌గౌడ్, శ్రీశైలం, నర్సింహారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ అవకాశం ఇవ్వండి..
భువనగిరి : తమకు ఓటు వేసి మళ్లీ గెలిపించడానికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రైల్వేస్టేషన్‌లో వాకర్స్‌ను కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ఓటు వేసి గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ నువ్వుల ప్రసన్న, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment