వేప, రావిచెట్టు గద్దె వద్ద పూజలు నిర్వహిస్తున్న పెద్ది
సాక్షి, దుగ్గొండి(నర్సంపేట): ‘కడుపేద కుటుంబంలో పుట్టాను.. తెలంగాణ కోసం ఉద్యమించాను.. ఎందరో ఆదరించారు. అన్నం పెట్టారు. మీ ఇంటిబిడ్డగా కడుపులో పెట్టి చూసుకున్నారు.. కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు.. పెద్ద మనసుతో నాకు ఓటు వేసి ఆశీర్వదించాలి’ అని నర్సంపేట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. మండలంలోని తొగర్రాయి, శివాజీ నగర్, బిక్కాజిపల్లి, రేకంపల్లి, చలపర్తి, జీడికల్, నారాయణతండా, తిమ్మంపేట, మహ్మదాపురం గ్రామాలలో పెద్ది మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు , బతుకమ్మలతో స్వాగతం పలికారు. నుదట తిలకం దిద్ది గెలుపు నీదే అంటూ ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పెద్ది ప్రసంగించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2001 నుంచి కేసీఆర్ వెంట నడిచానని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించానని గుర్తు చేశారు. కష్ట కాలంలో పార్టీని రక్షించే బాధ్యత తీసుకున్నానని వెల్లడించారు. పేదలు కూలి పోయే స్థితిలో ఉన్న ఇళ్లలో నివాసముంటున్నారని, వారందరికి తాను గెలిచిన అనంతరం డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో పట్టుబట్టి ఎస్సారెస్పీ జలాలు తీసుకొచ్చి వందలాది చెరువులు నింపి వేలాది ఎకరాల పంటకు సాగునీరందించామని గుర్తు చేశారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నూకల నరేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, జెడ్పీటీసీ సుకినె రజితరాజేశ్వర్‌రావు, ఎంపీపీ కుక్కముడి సుశీలా కమలాకర్, ఆర్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ తోకల నర్సింహారెడ్డి, నర్సంపేట మార్కెట్ వైస్ చైర్మన్ పొన్నం మొగిళి, కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, మేర్గు రాంబాబు, కాట్ల భద్రయ్య, రాణాప్రతాప్‌రెడ్డి, సాంబలక్ష్మి, జనార్దన్‌రెడ్డి, లింగయ్య, లింగంపల్లి రవీందర్, ముదరకోల కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, కుమారస్వామి, తిరుపతి, కోటి, విద్యాసాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment