గెలుపే లక్ష్యంగా పనిచేయాలి | Trs LeadersCanvass In Nalgonda | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Published Tue, Nov 13 2018 8:41 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Trs LeadersCanvass In Nalgonda - Sakshi

పిచ్చిరెడ్డికి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుతున్న సైదిరెడ్డి

సాక్షి,నేరేడుచర్ల : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన నేరేడుచర్లలో వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారికి కండువాలు కప్పి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. గత ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టక పోగా ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చిన ప్రజాదరనను చూసి ఓర్వలేక డబ్బుతో నాయకులను కొనుగోలు చేసి వ్యాపారం మొదలు పెట్టారన్నారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గపోరులేదని ఎవరికి టికెట్‌ వచ్చినా కలిసికట్టుగా పనిచేసి హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు పాలా ్వయి కృష్ణమూర్తి, జగతయ్య, ఎలీషా, సందీప్‌రెడ్డి, జాని, శ్రీను, రాజేష్, రాంరెడ్డి, బాల్‌రెడ్డి  పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement