24న ముల్కనూరుకు సీఎం రాక | TS CM KCR TOUR ON 24TH mulkanoor | Sakshi
Sakshi News home page

24న ముల్కనూరుకు సీఎం రాక

Published Fri, Aug 21 2015 2:09 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

TS CM KCR TOUR ON 24TH mulkanoor

చిగురుమామిడి :  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దత్తత గ్రామమైన మండలంలోని చిన్న ముల్కనూర్‌కు ఈ నెల 24న వస్తారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ తెలిపారు. బొమ్మనపల్లిలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఈ నెల 22న రావాల్సి ఉండగా, గ్రామజ్యోతి కార్యక్రమంలో బిజీగా ఉన్నందున పర్యటన 24న ఖరారైందని పేర్కొన్నారు. గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. తాను హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆరు గ్రామాలను తాను దత్తత తీసుకున్నప్పటికీ మిగిలిన గ్రామాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో రానున్న నాలుగేళ్లలో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement