మాట్లాడుతున్న మేయర్ రవీందర్‌సింగ్
టవర్‌సర్కిల్: సంక్షేమ పథకాలు అమలు విషయంలో సీఎం కేసీఆర్ దేశంలోనే ముందువరుసలో ఉన్నారని.. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేసీఆర్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని నగర మేయర్ రవీందర్‌సింగ్ ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జనచైతన్యయాత్ర పేరిట బీజేపీ హన్మకొండలో ఏర్పాటు చేసిన సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అడ్డగోలుగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ నేతల మగతనాన్ని ప్రశ్నించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నేతల మగతనం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.
మిషన్‌భగీరథతో ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని సవాలు విసిరిన వ్యక్తి కేసీఆర్ అని, 28 రాష్ట్రాల మంత్రులు ఇక్కడకు వచ్చి అభివృద్ధిని కొనియాడుతున్నారని గుర్తు చేశారు. వారిలోనూ బీజేపీ నేతలతోపాటు కేంద్ర మంత్రులు ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. జన్‌ధన్‌ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న కేంద్రం ప్రజలను మోసం చేసిందన్నారు. వై.సునీల్‌రావు, పెద్దపల్లి రవీందర్, కంసాల శ్రీనివాస్, ఎడ్ల అశోక్, సాదవేని శ్రీనివాస్, మేకేల్ శ్రీను, దండబోయిన రాము, జక్కం నర్సయ్య, గుంజపడుగు హరిప్రసాద్, యూసుఫ్, ప్రిన్స్‌రాజు, పురుషోత్తంసోనీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment