సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు
సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండున్నర గంటల పాటు పర్యటించనున్నారు. ఈనెల 9వ తేదీన జిల్లాలో సీఎం పర్యటన వివరాలను టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు వెల్లడించారు. హెలికాప్టర్ ద్వారా ఉదయం 11.45 గంటలకు సీఎం నిట్‌కు చేరుకుంటారు. కాళోజీ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు పయనమవుతారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో జరిగే కాళోజీ స్మారక సభకు వచ్చేవారు ఉదయం పది గంటలకే నిట్ ఆడిటోరియానికి చేరుకోవాలని రవీందర్‌రావు కోరారు.
అంతకుముందు బాలసముద్రం సబ్‌స్టేషన్ వెనక కాళోజీ కళాక్షేత్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం రవీందర్‌రావు పరిశీలించారు. ఆయన వెంట పార్టీ నేతలు నన్నపునేని నరేందర్, బూజు గుండ్ల రాజేంద్రకుమార్, గుడిమల్ల రవికుమార్, ఉడుతల సారంగపాణి, మహ్మద్ నయీమొద్దీన్, తొనుపునూరి వీరన్న, నలుబోలు సతీష్, కోరబోయిన సాంబయ్య తదితరులు ఉన్నారు.
మంగళవారం సీఎం పర్యటన వివరాలు
ఉదయం 11.45 గంటలు :హెలికాప్టర్ ద్వారా నిట్‌కు చేరుకుంటారు
11.51 గంటలు : నక్కలగుట్టలో కాళోజీ విగ్రహానికి పూలమాల వేస్తారు.
11.55 గంటలు : బాలసముద్రంలో నిర్మించనున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన
మధ్యాహ్నం 12.10 గంటలు : నిట్ ఆడిటోరియానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్మారక సభలో పాల్గొంటారు
1.30 గంటలు : కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి చేరుకుంటారు. అక్కడే లంచ్ చేస్తారు
2. 05 గంటలు : నిట్‌కు బయల్దేరుతారు
2. 15 గంటలు : హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ పయనం