takkellapalli Ravinder Rao
-
టీఆర్ఎస్ నేత రవీందర్రావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వరంగల్: టీఆర్ఎస్ తరఫున టికెట్ లభించని నేతల్లో అసంతృప్తి క్రమంగా బయటపడుతోంది. తాజాగా పాలకుర్తి అసెంబ్లీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు పర్యాయాలుగా పాలకుర్తి ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలిచిన అన్యాయమే జరిగిందని అన్నారు. ఉద్యమకారులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందడం లేదని విమర్శించారు. పాలకుర్తి అసెంబ్లీ స్థానంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరాలోచించి.. అక్కడి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాలకుర్తి ఉద్యమకారులు గడ్డ అని.. భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఉద్యమకారులను కాపాడే అవకాశం తనకు ఇవ్వాలని.. కార్యకర్తల ఇష్టానుసారం నడుచుకుంటానని అన్నారు. టీడీపీ నుంచి గెలిచిన దయాకర్ రావు టీఆర్ఎస్లో చేరిన తర్వాత పాలకుర్తిలో అభివృద్ది శూన్యం అని.. ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. తనకు ఇస్తానని చెప్పిన వరంగల్ ఎమ్మెల్సీ పదవి కొండ మురళికి ఇచ్చినా తాను బాధపడలేదని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయసేకరణతోనే తనకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 2004, 2009, 2014లలో పాలకుర్తి అసెంబ్లీ టికెట్‌పై ఆశ పడినప్పటికీ.. కేసీఆర్ ఆదేశాల మేరకు తప్పుకున్నానని తెలిపారు. -
కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదనే విమర్శలు
► అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ నేతలు ► ఎంపీలు ప్రొఫెసర్ సీతారాంనాయక్, పసునూరి దయాకర్ ► పాచికగా కోదండరాంను వాడుకుంటున్న కాంగ్రెస్ ► టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు హన్మకొండ : టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎక్కడ తమకు భవిష్యత్ ఉండదేమోననే భయంతో కాంగ్రెస్ నాయకులు ఆయనపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఎంపీలు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, పసునూరి దయాకర్ విరుచుకుపడ్డారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేం దుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో తెలంగాణకు రావాల్సిన వాటా నీరు రాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోర్టుకు వెళితే, ప్రాజెక్టులు నిర్మించకుండా అడ్డుపడుతూ కాంగ్రెస్ నాయకులు గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో వారిలో వారికే సఖ్యత లేదని, ఆ పార్టీలోని నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. గిరిజన నియోజకవర్గానికి ఏనాడైనా వెళ్లారా, ప్రత్యేక నిధులేమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించడంలో అర్థం లేదన్నారు. రాజకీయ బలం లేని కాంగ్రెస్ రాజకీయంగా బలం లేని కాంగ్రెస్ తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను పాచికగా వాడుకుంటుందని టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమ నేతగా కేసీఆర్ ఎక్కని మెట్టు లేదని, కలువని పార్టీ, నాయకుడు లేడన్నారు. తెలంగాణలో దేశంలోనే అభివృద్ధిలో ముందు నిలి పేందుకు సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారన్నారు. మూడేళ్ళ పాలన చూసి జాతి గర్విస్తుందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు జన్ను జకార్య, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, నయిముద్దీన్, జోరిక రమేశ్, కమరున్నీసాబేగం, కోల జనార్ధన్, పులి సారంగపాణి, కత్తరపల్లి దామోదర్, పద్మ, శ్రీజా నాయక్, పోగు ల రమేశ్, నాగపురి రాజేష్ పాల్గొన్నారు. -
మంత్రి హరీష్‌రావు పర్యటనకు తరలిరావాలి
పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్న రాజవర్దన్‌రెడ్డి మహబూబాబాద్ : రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి హరీష్‌రావు తొలిసారిగా గురువారం మానుకోటకు వస్తున్నారని, ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ మానుకోట మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంత్రి చేస్తారని తెలిపారు. మంత్రి హరీష్‌రావుతోపాటు గిరిజన, ప ర్యాటక శాఖ మంత్రి చందూలాల్, పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు వస్తున్నారని చెప్పారు. మైసమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తాం : ఎమ్మెల్యే అనంతారంలోని అనంతాద్రి దేవాలయం పక్కన ఉన్న మైసమ్మ చెరువును 4.98 కోట్ల వ్యయంతో పర్యాటక కేంద్రంగా, మి నీట్యాంక్ బండ్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తెలిపారు. ఆ చెరువును మంత్రి సందర్శించడంతోపాటు ఆ చెరువు విషయాన్ని మంత్రికి వివరించినట్లు వెల్లడించారు. నాయకులు మార్నేని వెంకన్న, భీరవెల్లి భరత్‌కుమార్ రెడ్డి, పాల్వాయి రాంమ్మోహన్‌రెడ్డి, డోలి లింగుబాబు, కన్న, జెర్రిపోతుల వెంకన్న, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మాచర్ల ఉప్పలయ్య, పొనుగోటి రామకృష్ణారావు, తూము వెంకన్న, గోగుల మల్లయ్య పాల్గొన్నారు. మంత్రి పర్యటన మ్యాప్ రూట్ వివరాలు.. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నెల్లికుదురు నుంచి 200 బైక్‌లతో ర్యాలీగా మానుకోటకు చేరుకుంటారు. ఏరియా ఆస్పత్రికి వెళ్లి అక్కడి నుంచి అనంతాద్రి దేవాలయం, మైసమ్మ చెరువు సందర్శిస్తారు. సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన, మానుకోటలో పలు అభివృద్ది పనులు, రెడ్యాల లో ప్రభుత్వ హాస్టల్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. యశోదా గార్డెన్లో పీసీసీ కార్యదర్శి రాజవర్దన్రెడ్డితోపాటు పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరే సభలో పాల్గొని తిరిగి వెళతారు. -
సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు
సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండున్నర గంటల పాటు పర్యటించనున్నారు. ఈనెల 9వ తేదీన జిల్లాలో సీఎం పర్యటన వివరాలను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు వెల్లడించారు. హెలికాప్టర్ ద్వారా ఉదయం 11.45 గంటలకు సీఎం నిట్‌కు చేరుకుంటారు. కాళోజీ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు పయనమవుతారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో జరిగే కాళోజీ స్మారక సభకు వచ్చేవారు ఉదయం పది గంటలకే నిట్ ఆడిటోరియానికి చేరుకోవాలని రవీందర్రావు కోరారు. అంతకుముందు బాలసముద్రం సబ్‌స్టేషన్ వెనక కాళోజీ కళాక్షేత్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం రవీందర్రావు పరిశీలించారు. ఆయన వెంట పార్టీ నేతలు నన్నపునేని నరేందర్, బూజు గుండ్ల రాజేంద్రకుమార్, గుడిమల్ల రవికుమార్, ఉడుతల సారంగపాణి, మహ్మద్ నయీమొద్దీన్, తొనుపునూరి వీరన్న, నలుబోలు సతీష్, కోరబోయిన సాంబయ్య తదితరులు ఉన్నారు. మంగళవారం సీఎం పర్యటన వివరాలు ఉదయం 11.45 గంటలు :హెలికాప్టర్ ద్వారా నిట్‌కు చేరుకుంటారు 11.51 గంటలు : నక్కలగుట్టలో కాళోజీ విగ్రహానికి పూలమాల వేస్తారు. 11.55 గంటలు : బాలసముద్రంలో నిర్మించనున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన మధ్యాహ్నం 12.10 గంటలు : నిట్ ఆడిటోరియానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్మారక సభలో పాల్గొంటారు 1.30 గంటలు : కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి చేరుకుంటారు. అక్కడే లంచ్ చేస్తారు 2. 05 గంటలు : నిట్‌కు బయల్దేరుతారు 2. 15 గంటలు : హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ పయనం