'వారి ఉసురు తప్పకుండా తగులుతుంది' | tummala nageswara rao slams tdp government | Sakshi
Sakshi News home page

'వారి ఉసురు తప్పకుండా తగులుతుంది'

Published Fri, Sep 5 2014 5:45 PM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

'వారి ఉసురు తప్పకుండా తగులుతుంది'

'వారి ఉసురు తప్పకుండా తగులుతుంది'

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో తెలంగాణలో అగ్రగామిగా నిలిపేందుకు బాధ్యత తీసుకుంటామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్ సమక్షంలో శుక్రవారం ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ... అభివృద్ధిలో గుజరాత్ కంటే తెలంగాణ ముందుండాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ సీఎం పదవి చేపట్టారని అన్నారు. తెలంగాణను ముందుకు తీసుకెళ్లే భాగంగా కేసీఆర్ ను శక్తివంతుడిని చేసేందుకు ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

కేంద్రం, ఏపీ ప్రభుత్వాల తీరు తనను బాధించిందని తమ్ముల అన్నారు. తమ జిల్లాలోని ఏడు మండలాలను ఆదరాబాదరా ఆంధ్రప్రదేశ్ లో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ల ఉసురు తప్పకుండా తగులుతుందని శపించారు. ప్రజలను నష్టపెట్టకుండా ప్రాజెక్టులు కట్టుకోవాలని, పక్క రాష్ట్రాలను నష్టపెట్టకుండా నీళ్లు తీసుకెళ్లాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement