మిరుదొడ్డి (మెదక్) : నకిలీ ధ్రువ పత్రాలను సృష్టించిన అరుణం చంద్రారెడ్డి, పాటిగారి లక్ష్మీనారాయణ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు మిరుదొడ్డి ఎస్సై సతీష్ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన శేరి కుమార్ బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు.
అత్యవసరంగా పుట్టిన తేదీ ధ్రువపత్రం అవసరమైంది. దీని కోసం కరీంనగర్ జిల్లా జిల్లెల గ్రామానికి చెందిన అరుణం చంద్రారెడ్డి, నిజామాబాద్ జిల్లా రామారెడ్డి గ్రామానికి చెందిన పాటిగారి లక్ష్మీనారాయణలను ఆశ్రయించాడు. దీంతో వారు శేరి కుమార్ నుంచి రూ.5 వేలు తీసుకుని పుట్టిన తేదీ సర్టిఫికెట్ అంటగట్టారు. అనుమానం వచ్చిన బాధితుడు ఆన్‌లైన్ లో పరిశీలించగా అది నకిలీదని తేలింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు.
నకిలీ సర్టిఫికెట్లు సృష్టించిన ఇద్దరి అరెస్ట్
Published Tue, Dec 15 2015 3:36 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
Advertisement
Advertisement