మంత్రాల నెపంతో ఇద్దరు అరెస్ట్ | two arrested in the Pretense of chanting Mantras | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపంతో ఇద్దరు అరెస్ట్

Published Fri, Feb 27 2015 5:03 PM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

two arrested in the Pretense of chanting Mantras

మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కోనేయిపల్లి(పీటీ) గ్రామంలో మంత్రాలతో పిల్లల ప్రాణాలను తీస్తున్నారనే అనుమానంతో ఇద్దరిని గ్రామస్తులు గ్రామపంచాయతీ ఆఫీసులో బంధించారు. వివరాలు...కుమ్మరి సత్తయ్య, మల్లె యాదగిరి అనే ఇద్దరు గ్రామానికి దగ్గరలోని అడవిలో నగ్నంగా నిలబడి మంత్రాలు ఉచ్ఛరిస్తుండగా అదే గ్రామానికి చెందిన కొంతమంది వారిని గుర్తించారు. దీంతో వారిని పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు కోనేయిపల్లి  గ్రామానికి చేరుకుని ఆ ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని, కోనేయపల్లిలోనే వారిని చంపేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో మరికొంత మంది పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

(తూప్రాన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement